డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్‌స్టార్ అండర్‌టేకర్ రిటైర్‌మెంట్

ABN , First Publish Date - 2020-06-23T03:28:26+05:30 IST

కుర్రాళ్లంతా ఎగబడి చూసే రెజ్లింగ్ ప్రోగ్రామ్ డబ్ల్యూడబ్ల్యూఈ. అమెరికాకు చెందిన ఈ షోకు ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులున్నారు.

డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్‌స్టార్ అండర్‌టేకర్ రిటైర్‌మెంట్

వాషింగ్టన్: కుర్రాళ్లంతా ఎగబడి చూసే రెజ్లింగ్ ప్రోగ్రామ్ డబ్ల్యూడబ్ల్యూఈ. అమెరికాకు చెందిన ఈ షోకు ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులున్నారు. దీనిలో చాలాకాలంగా కనిపిస్తూ, ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న వారిలో అండర్‌టేకర్ ఒకడు. అతను తాజాగా డబ్ల్యూడబ్ల్యూఈకి రిటైర్‌మెంట్ ప్రకటించాడు. ‘ది లాస్ట్ రైడ్’ అనే డాక్యూసిరీస్‌ చివర్లో తాను రిటైర్ అవుతున్నట్లు అండర్‌టేకర్ వెల్లడించాడు. జీవితంలో మరోసారి డబ్ల్యూడబ్ల్యూఈ రింగులో అడుగుపెట్టబోనని తెలిపాడు. ‘ఇంతకాలం కష్టపడి సంపాదించిన ఫలాలను ఇకనైనా అనుభవించాలి. నాకూ మరో జీవితం ఉంటుంది కదా’ అని ఈ 55ఏళ్ల రెజ్లర్ ట్వీట్ చేశాడు.

Updated Date - 2020-06-23T03:28:26+05:30 IST