ప్రశాంతంగా నిరసన వ్యక్తం చేయడానికి రైతులకు అనుమతినివ్వాలి : కేజ్రీవాల్

ABN , First Publish Date - 2020-11-26T19:23:03+05:30 IST

సీఎం కేజ్రీవాల్ రైతులకు మద్దతుగా నిలిచారు. ఢిల్లీలో తమ నిరసనను శాంతియుతంగా వ్యక్తం చేయడానికి రైతులకు

ప్రశాంతంగా నిరసన వ్యక్తం చేయడానికి రైతులకు అనుమతినివ్వాలి : కేజ్రీవాల్

న్యూఢిల్లీ : సీఎం కేజ్రీవాల్ రైతులకు మద్దతుగా నిలిచారు. ఢిల్లీలో తమ నిరసనను శాంతియుతంగా వ్యక్తం చేయడానికి రైతులకు అనుమతినివ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ‘‘కేంద్రం తీసుకొచ్చిన మూడు చట్టాలూ రైతులకు వ్యతిరేకమే. అలాంటి చట్టాలను వెనక్కి తీసుకోవాల్సింది పోయి.... నిరసన వ్యక్తం చేస్తున్న రైతులను అడ్డుకుంటున్నారు. వారిపై వాటర్ కెనన్స్ ప్రయోగించారు. ఇది అన్యాయమే. ప్రశాంతంగా నిరసన వ్యక్తం చేయడం అనేది రాజ్యాంగ హక్కు.’’ అని సీఎం కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. అంబాలా- పాటియాలా ప్రాంతంలో రైతులకు, పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. కేంద్రం తీసుకొచ్చిన చట్టాలను వ్యతిరేకిస్తూ ఐదు రాష్ట్రాలకు చెందిన రైతులు చలో ఢిల్లీ ప్రకటించారు. ఈ నిరసన ప్రదర్శన అంబాలా- పాటియాలా ప్రాంతానికి చేరుకునే సరికి ఉద్రిక్తంగా మారిపోయింది. పోలీసులు ఏర్పర్చిన బారికేడ్లను రైతులు పక్కనే ఉన్న శంభూ నదిలోకి విసిరేశారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. పరిస్థితి అదుపు తప్పడంతో రైతులపై పోలీసులు టియర్ గ్యాస్, వాటర్ కెనన్లను ప్రయోగించారు. 

Updated Date - 2020-11-26T19:23:03+05:30 IST