కరోనా ఎఫెక్ట్: ఆర్థిక మాంద్యంలోకి జారుకున్న జపాన్

ABN , First Publish Date - 2020-05-18T21:30:12+05:30 IST

చైనాలో ఉద్భవించిన కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. లక్షల మంది ప్రాణాలను బలిగొంది. ఎన్నో దేశాల ఆర్థిక వ్యవస్థలు...

కరోనా ఎఫెక్ట్: ఆర్థిక మాంద్యంలోకి  జారుకున్న జపాన్

టోక్యో: చైనాలో ఉద్భవించిన కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. లక్షల మంది ప్రాణాలను బలిగొంది. ఎన్నో దేశాల ఆర్థిక వ్యవస్థలు ఈ మహమ్మారి వల్ల చిన్నాభిన్నం అవుతున్నాయి. తీవ్రంగా నష్టపోతున్నాయి. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన జపాన్ కూడా ఈ మహమ్మారి వల్ల సంక్షోభంలోకి జారిపోయింది. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది ఇప్పటికే ఆర్థిక వ్యవస్థ 3.4 శాతం దిగజారింది. 2015 తర్వాత ఈ స్థాయిలో ఆర్థికంగా దెబ్బతినడం జపాన్‌కు ఇదే తొలిసారి. ఇదిలా ఉంటే కరోనా కారణంగా జపాన్‌లో పూర్తి స్థాయి లాక్‌డౌన్‌ను కూడా ప్రకటించలేదు. కేవలం అత్యవసర పరిస్థితిని మాత్రమే ప్రకటించారు. దీనివల్ల జపాన్‌లోని వ్యాపారాలతో పాటు వస్తు, సేవల సప్లై చైన్ కూడా తీవ్రంగా దెబ్బతిన్నది. దీని కారణంగానే ఆ దేశంలో ప్రస్తుతం ఆర్థిక మాంద్యం ఏర్పడినట్లు తెలుస్తోంది.

Updated Date - 2020-05-18T21:30:12+05:30 IST