అంతరిక్షంలో ‘మహా సంయోగం’!

ABN , First Publish Date - 2020-12-07T07:44:30+05:30 IST

అంతరిక్షంలో అద్భుతం ఆవిష్కృతం కానుంది. రెండు మహా గ్రహాలు ఒక్కటైపోయాయా అనిపించేంతగా దగ్గర కానున్నా యి. ఓ భారీ నక్షత్రంలా ప్రకాశించనున్నాయి. సౌర కుటుంబంలోని రెండు పెద్ద గ్రహాలైన గురుడు...

అంతరిక్షంలో ‘మహా సంయోగం’!

  • 21న ఒకదానికొకటి దగ్గరవనున్న గురు, శని గ్రహాలు


కోల్‌కతా, డిసెంబరు 6: అంతరిక్షంలో అద్భుతం ఆవిష్కృతం కానుంది. రెండు మహా గ్రహాలు ఒక్కటైపోయాయా అనిపించేంతగా దగ్గర కానున్నా యి. ఓ భారీ నక్షత్రంలా ప్రకాశించనున్నాయి. సౌర కుటుంబంలోని రెండు పెద్ద గ్రహాలైన గురుడు, శని ఒకదానికొకటి అత్యంత సమీపంలోకి రానున్నాయి. ఆ సమయంలో వాటి మధ్య దూరం 73.50 కోట్ల కిలో మీటర్లుగా ఉం టుంది. 1623వ సంవత్సరం తర్వాత జరిగే ఈ అద్భుతం ఈనెల 21న ఖగోళ ప్రియులకు కనువిందు చేయనుంది. ‘మహా సంయోగం’గా పిలిచే ఈ అంతరిక్ష అద్భుతం భారతీయులను కూడా కనువిందు చేస్తుందని, దేశంలోని అన్ని ప్రాంతాల వారూ సూర్యాస్తమయం తర్వాత చూడవచ్చని కోల్‌కతాలోని జేపీ బిర్లా ప్లానిటోరియం డైరెక్టర్‌ దేవీ ప్రసాద్‌ దురై తెలిపారు.

Updated Date - 2020-12-07T07:44:30+05:30 IST