2020.. అంతర్గత ఆవిష్కరణల ఏడాది

ABN , First Publish Date - 2020-12-01T07:43:41+05:30 IST

కొవిడ్‌ మహమ్మారితో ప్రపంచానికి భారత శక్తి తెలిసి వచ్చిందని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. ‘మనోరమ ఇయర్‌ బుక్‌-2021’ కోసం మోదీ ‘ఆత్మనిర్భర్‌-మారుతున్న భారత్‌’ అనే శీర్షికతో సోమవారం ప్రత్యేక వ్యాసం రాశారు...

2020.. అంతర్గత ఆవిష్కరణల ఏడాది

  • ప్రపంచానికి భారత శక్తి తెలిసింది: మోదీ


న్యూఢిల్లీ, నవంబరు 30: కొవిడ్‌ మహమ్మారితో ప్రపంచానికి భారత శక్తి తెలిసి వచ్చిందని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. ‘మనోరమ ఇయర్‌ బుక్‌-2021’ కోసం మోదీ ‘ఆత్మనిర్భర్‌-మారుతున్న భారత్‌’ అనే శీర్షికతో సోమవారం ప్రత్యేక వ్యాసం రాశారు. ‘‘2020ను బయటి శక్తులు కలిగించిన అంతరాయంగా కొందరు భావిస్తున్నారు. నేను మాత్రం దీన్ని అంతర్గత ఆవిష్కరణల ఏడాదిగా చూస్తున్నాను. సంక్షోభ సమయంలో దేశంలోని పేదలు-ధనవంతులు, యువత-వృద్ధులు, గ్రామీణులు-పట్టణవాసులు చూపిన బాధ్యత, క్రమశిక్షణ, సహనం, నిబంధనల అమలుతో ప్రపంచాన్ని నివ్వెర పరిచారు. ప్రతికూలత.. బలాన్ని పెంచుకోవడమే కాదు.. మన సహజ స్వభావాన్ని బయటికి తీసుకొస్తుంది. ఈ మహమ్మారి దేశ ప్రజల్లోని జాతీయ స్వభావాన్ని తెరపైకి తెచ్చింది’’ అని పేర్కొన్నారు. కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ తయారీ కోసం దేశంలోని పలు ఫార్మా కంపెనీలు కష్టపడుతున్నాయని ప్రధాని తెలిపారు. 

Updated Date - 2020-12-01T07:43:41+05:30 IST