చైనాతో వ్యాపారానికి ప్రపంచం ఇష్టపడటం లేదు : నితిన్ గడ్కరీ

ABN , First Publish Date - 2020-04-26T03:23:09+05:30 IST

చైనాతో వ్యాపారానికి ప్రపంచ దేశాలు ఇష్టపడటం లేదని, ఇది మన దేశానికి

చైనాతో వ్యాపారానికి ప్రపంచం ఇష్టపడటం లేదు : నితిన్ గడ్కరీ

న్యూఢిల్లీ : చైనాతో వ్యాపారానికి ప్రపంచ దేశాలు ఇష్టపడటం లేదని, ఇది మన దేశానికి వరం వంటిదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఓ టీవీ న్యూస్ ఛానల్‌తో ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా అమలవుతున్న అష్ట దిగ్బంధనం వల్ల నష్టపోతున్న సూక్ష్మ, చిన్న తరహా, మధ్య తరహా సంస్థలు (ఎంఎస్ఎంఈ)లకు ప్రభుత్వ సహాయం గురించి వివరించారు. 


కరోనా వైరస్ మహమ్మారి విస్తరించిన నేపథ్యంలో ప్రపంచంలో బలమైన ఆర్థిక శక్తి అయిన చైనాతో వ్యాపార, వాణిజ్య సంబంధాలను నెరపేందుకు ప్రపంచ దేశాలు ఇష్టపడటం లేదని గడ్కరీ అన్నారు. ఇది మన దేశానికి వరం వంటిదని తెలిపారు. 


2025 నాటికి మన దేశం 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిర్దేశించిన లక్ష్యం నెరవేరడానికి ఈ పరిణామాలు అవకాశం కల్పిస్తాయన్నారు. ఈ కలల సాకారానికి నూతన టెక్నాలజీని పెట్టుబడిగా మార్చడానికి ఓ జాయింట్ సెక్రటరీని ఏర్పాటు చేస్తామన్నారు. 


ప్రపంచంలో ప్రతి దేశం ప్రస్తుతం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోందన్నారు. అయినప్పటికీ చైనాతో వ్యాపారం చేయాలని కోరుకోవడం లేదన్నారు. చైనా ఆర్థికంగా సూపర్ పవర్ అయినప్పటికీ ఆ దేశంతో వ్యాపారానికి ఇతర దేశాలు ముందుకు రావడం లేదన్నారు. ఇది భారత దేశానికి పరోక్ష వరమని తెలిపారు.


Updated Date - 2020-04-26T03:23:09+05:30 IST