కరోనా కాలంలోనూ వారణాసిలో ‘శ్రీకృష్ణ లీల’... మాస్క్‌లతో వీక్షించిన భక్తులు!

ABN , First Publish Date - 2020-11-19T12:48:19+05:30 IST

యూపీలోని వారణాసిలో శ్రీకృష్ణ భక్తి పొంగి ప్రవహించింది. ప్రస్తుత కరోనా కాలంలోనూ....

కరోనా కాలంలోనూ వారణాసిలో ‘శ్రీకృష్ణ లీల’... మాస్క్‌లతో వీక్షించిన భక్తులు!

వారణాసి: యూపీలోని వారణాసిలో శ్రీకృష్ణ భక్తి పొంగి ప్రవహించింది. ప్రస్తుత కరోనా కాలంలోనూ తులసీఘాట్ వద్ద 450 ఏళ్ల పురాతన ఆచారం కొనసాగింది. వేలాదిమంది భక్తుల మధ్య ‘శ్రీకృష్ణ లీల’ను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో కాశీ రాజవంశీయుడు అనంత్ నారాయణ్ కూడా పాల్గొన్నారు. శ్రీకృష్ణ లీల అయిన కాళీయ మర్థనం ఘట్టాన్ని కళాకారులు అద్భుతంగా ప్రదర్శించారు. 


లక్షలాది మంది భక్తులు ఈ ప్రదర్శనను వీక్షించారు. ఈ సందర్భంగా తులసీదాస్ అఖాడే మహంత్ డాక్టర్ విశ్వంభర్ నాథ్ మిశ్రా మాట్లాడుతూ ద్వారకలో శ్రీకృష్ణుడు ఏవిధంగా కాళీయ మర్థనంతో కాలుష్యం నుంచి విముక్తి కల్పించాడో, అదే రీతిన ఈ కలియుగంతో కూడా కాలుష్యం బారి నుంచి మనల్ని శ్రీకృష్ణ పరమాత్మ కాపాడతాడని అన్నారు.

Updated Date - 2020-11-19T12:48:19+05:30 IST