కరోనా: పాక్‌కు రుణం మంజూరు చేసిన ప్రపంచ బ్యాంకు

ABN , First Publish Date - 2020-05-25T03:54:35+05:30 IST

కరోనా కట్టడి కోసం ప్రపంచ బ్యాంకు పాకిస్థాన్‌కు 500 మిలియన్ డాలర్ల రుణాన్ని అందించేందుకు నిర్ణయించింది.

కరోనా: పాక్‌కు రుణం మంజూరు చేసిన ప్రపంచ బ్యాంకు

ఇస్లామాబాద్: కరోనా కట్టడి కోసం ప్రపంచ బ్యాంకు పాకిస్థాన్‌కు 500 మిలియన్ డాలర్ల రుణాన్ని అందించేందుకు నిర్ణయించింది. శుక్రవారం జరిగిన బోర్డు సమావేశంలో అధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కరోనా కట్టడితో పాటూ ఆరోగ్య, విద్యా వ్యవస్థలను మెరుగుపరిచేందుకు, మహిళా అభివృద్ధి కోసం వరల్డ్ బ్యాంకు ఈ నిధులను కేటాయించింది. కరోనా ఉపద్రవం వెంటాడుతున్న నేపథ్యంలో పాక్‌ ప్రభుత్వం పాలనపరమైన, రాజకీయ పరమైన సమస్యలు కూడా ఎదుర్కొనే అవకాశం ఉందని బ్యాంకు అభిప్రాయపడింది. మరోవైపు.. దేశంలోని వనరులన్నీ కొందరి ఆధీనంలో ఉండటంతో సహాయ కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రభుత్వ ఖజానాలో సరిపడా ధనం ఉండకపోవచ్చునని కూడా వ్యాఖ్యానించింది. కాగా.. పాక్‌కు ధనం సహాయం చేయాలనే అంశం అనేక రోజుల క్రితమే వరల్డ్ బ్యాంకు దృష్టికి వచ్చింది. అయితే పాక్ తలసరి రుణ భారం తగ్గించేందుకు అక్కడి ప్రభుత్వానికి ఏయే సంస్కరలు సూచించాలనే విషయంలో స్పష్టత లోపించడంతో రుణ మంజూరులో జాప్యం ఏర్పడింది.

Updated Date - 2020-05-25T03:54:35+05:30 IST