‘వర్క్ ఫ్రం హోం’ ఏడాదిపాటు పొడిగింపు... గూగుల్ కీలక నిర్ణయం...

ABN , First Publish Date - 2020-07-29T00:26:54+05:30 IST

కరోనా మహమ్మారి నేపథ్యంలో సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్... తన ఉద్యోగులకు సంబంధించి ‘వర్క్ ఫ్రం హోం’ సౌకర్యాన్ని మరో ఏడాదిపాటు పొడిగించింది. కరోనా కారణంగా ఐటీ కంపెనీలతో పాటు వివిధ రంగాల్లోని ఉద్యోగులు... వర్క్ ఫ్రం హోం వెసులుబాటును పొందిన విషయం తెలిసిందే.

‘వర్క్ ఫ్రం హోం’ ఏడాదిపాటు పొడిగింపు... గూగుల్ కీలక నిర్ణయం...

కాలిఫోర్నియా : కరోనా మహమ్మారి నేపథ్యంలో సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్... తన ఉద్యోగులకు సంబంధించి ‘వర్క్ ఫ్రం హోం’ సౌకర్యాన్ని మరో ఏడాదిపాటు పొడిగించింది. కరోనా కారణంగా ఐటీ కంపెనీలతో పాటు వివిధ రంగాల్లోని ఉద్యోగులు... వర్క్ ఫ్రం హోం వెసులుబాటును పొందిన విషయం తెలిసిందే. 


కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రభుత్వాలు తీవ్రంగా యత్నిస్తున్నాయి. ఇక పెద్ద పెద్ద సంస్థలు సైతం ఇందులో భాగంగానే... తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ వెసులుబాటునిచ్చాయి. కరోనా నేపధ్యంలో ఉద్యోగులు కూడా కార్యాలయాలకు రావడానికి భయపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో గూగుల్ తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్‌ను వచ్చే ఏడాది జూన్ 30 వరకు  వరకు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.


రెండు లక్షలమంది ఉద్యోగులకు ఈ నిర్ణయం నేపధ్యంలో ఊరట కలగనుంది. సంస్థ నిర్ణయాన్ని ఉద్యోగులకు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్... మెయిల్ ద్వారా తెలిపారు. కార్యాలయాలకు వచ్చే అవసరం లేకుండా, ఇంటి నుండి పని చేసే వెసులుబాటును వచ్చే జూన్ 30 వ వరకు పొడిగిస్తున్నట్లు ఆ మెయిల్‌లో పేర్కొన్నారు.


గూగుల్ నిర్ణయంతో ప్రపంచవ్యాప్తంగా దాదాపు రెండు లక్షల మందికి పైగా ఉద్యోగులు, కాంట్రాక్టర్లకు ఉపశమనం లభిస్తుంది. కాగా... గూగుల్ నిర్ణయంతో ఇతర కంపెనీలపై కూడా ప్రభావం పడే అవకాశముందని కార్పొరేట్ వర్గాలు భావిస్తున్నాయి. 

Updated Date - 2020-07-29T00:26:54+05:30 IST