లాక్‌డౌన్ వేళ త్రిబుల్ రైడింగ్.. అడ్డగించిన మహిళా కానిస్టేబుల్‌పై దాడి
ABN , First Publish Date - 2020-04-05T23:20:32+05:30 IST
లాక్ డౌన్ వేళ నిబంధనలు ఉల్లంఘించి, రోడ్డుపైకి వచ్చారా ముగురు. ఒకే బైక్ పై వెళ్తున్న ఆ ముగురిని ఓ మహిళా కానిస్టేబుల్ చూసింది. వెంటనే వారిని...

బెంగళూరు: లాక్‌డౌన్ వేళ నిబంధనలు ఉల్లంఘించి, రోడ్డుపైకి వచ్చారా ముగురు. ఒకే బైక్‌పై వెళ్తున్న ఆ ముగురిని ఓ మహిళా కానిస్టేబుల్ చూసింది. వెంటనే వారిని అడ్డగించింది. లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించినందుకు ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతే ఆ బైక్ పై ఉన్న వ్యక్తులు ఆమెపై దాడి చేశారు. కొట్టి, బైక్‌పై వెళ్తూ కొంతదూరం ఆమెను బలవంతంగా లాక్కెళ్లారు. ఈ ఘటనలో సదరు కానిస్టేబుల్ మొహానికి, చేతులకు గాయాలయ్యాయి. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో చోటుచేసుకుంది. దీనిపై కేసు నమోదు చేసుకున్నామని, దర్యాప్తు జరుగుతోందని పోలీసు అధికారులు తెలిపారు.