లంక డాన్‌కు విషమిచ్చి చంపిన మహిళ?

ABN , First Publish Date - 2020-08-10T07:53:00+05:30 IST

శ్రీలంకకు చెందిన ఓ డాన్‌ చెంతనే ఉంటూ అతడికేవిషమిచ్చి చంపిందో మహిళ! శ్రీలంకలో తన భర్తను అతడు హత్యచేసినందుకు ప్రతీకారంగానే ఆమె ఈ పనిచేసినట్లు భావిస్తున్నారు...

లంక డాన్‌కు విషమిచ్చి చంపిన మహిళ?

  • భర్త హత్యకు ప్రతీకారం.. ఆమె సహా ముగ్గురు అరెస్టు

కోయంబత్తూర్‌, ఆగస్టు 9: శ్రీలంకకు చెందిన ఓ డాన్‌ చెంతనే ఉంటూ అతడికేవిషమిచ్చి చంపిందో మహిళ! శ్రీలంకలో తన భర్తను అతడు హత్యచేసినందుకు ప్రతీకారంగానే ఆమె ఈ పనిచేసినట్లు భావిస్తున్నారు. హతు డు.. అన్‌గోడా లొక్కా అలియాస్‌ ప్రదీప్‌ సింగ్‌ లంక పోలీసుల మోస్ట్‌ వాం టెడ్‌ జాబితాలో ఉన్నాడు. 2017లో భారత్‌కు వచ్చి కోయంబత్తూర్‌లోనే ఉంటున్నాడు. జూలై 3న లొక్కా మరణించాడు. అయితే విషప్రయోగం జరిగిందని అనుమానిస్తున్నారు. ఈ మేరకు ఆయనకు విషం ఇచ్చినట్లుగా భావిస్తున్న ఆమని థాన్జీ అనే మహిళ సహా శివకామి సుందరి, ధ్యానేశ్వరన్‌లను అదుపులోకి తీసుకున్నారు. లొక్కాను చంపేందుకు ప్రత్యేకంగా ఆమని థాన్జీని ఓ గ్యాంగ్‌ నియమించిందని అక్కడి పత్రికలు పేర్కొన్నాయి. 


Updated Date - 2020-08-10T07:53:00+05:30 IST