తనను ఆపిందని.. మహిళా కానిస్టేబుల్ యునిఫామ్ చింపేసింది..
ABN , First Publish Date - 2020-04-05T19:09:49+05:30 IST
హరియాణాలోని బహదూర్‌ఘర్‌లో లాక్‌డౌన్‌ను అతిక్రమించిన ఓ మహిళ.. ఆమెను అడ్డుకున్న మహిళా కానిస్టేబుల్‌పై దాడికి తెగబడిన ఘటన చోటు చేసుకుంది.

ఛండీగఢ్: హరియాణాలోని బహదూర్‌ఘర్‌లో లాక్‌డౌన్‌ను అతిక్రమించిన ఓ మహిళ.. ఆమెను అడ్డుకున్న మహిళా కానిస్టేబుల్‌పై దాడికి తెగబడిన ఘటన చోటు చేసుకుంది. బహదూర్‌ఘర్ ఎస్పీ అజైబ్ సింగ్ తెలిపిన సమాచారం ప్రకారం.. ఆ మహిళ లాక్‌డౌన్‌తో తనకు సంబంధం లేదని.. తనని అడుకొనే అధికారం ఎవరికీ లేదని పోలీసులతో వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది.
‘‘లాక్డౌన్ అమలులో ఉన్న కారణంగా డ్యూటీలో ఉన్న పోలీసులు నడిచి వెళ్తున్న ఆ మహిళను అడ్గుకున్నారు. ఆమె ఇంటి నుంచి బయటకు రావాల్సిన అవసరం ఏం వచ్చిందని వాళ్లు ప్రశ్నించారు. అయితే అందుకు సమాధానం చెప్పకుండా.. అక్కడ ఉన్న మహిళా కానిస్టేబుల్ని అసభ్యంగా తిడుతూ.. ఆమెపై దాడి చేసింది’’ అని అజైబ్ అన్నారు. ఈ క్రమంలో ఆమె ఆ మహిళ కానిస్టేబుల్ యూనిఫామ్‌ని చింపేసిందని ఆమె పేర్కొన్నారు. ఈ ఘటనని కొందరు రికార్డు చేసి సోషల్‌మీడియాలో పెట్టడంతో.. ఆ వీడియో వైరల్ అయింది. సదరు మహిళను అదుపులోకి తీసుకున్న పోలీసులు తగిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని చెప్పారు.