కూతురు పాట రికార్డ్ చేస్తుండగా సీలింగ్ నుంచి కింద పడ్డ తల్లి

ABN , First Publish Date - 2020-09-04T00:06:33+05:30 IST

కూతురు పాట రికార్డ్ చేస్తుండగా సీలింగ్ నుంచి కింద పడ్డ తల్లి

కూతురు పాట రికార్డ్ చేస్తుండగా సీలింగ్ నుంచి కింద పడ్డ తల్లి

న్యూఢిల్లీ: తల్లీకూతుళ్లకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెటిజెన్లను అమితాశ్చర్యానికి గురి చేస్తోంది. కూతురు పాట పాడుతూ వీడియో రికార్డ్ చేస్తుండగా సీలింగ్ ఒక్కసారిగా కూలింది. అందులోంచి తన తల్లి కిందకు పడిపోయింది. 10 నిమిషాలు ఉన్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


లిజ్ సాన్ మిలాన్ అనే టిక్‌టాక్ యూజర్ ఈ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియో ప్రకారం.. ఒక యువతి చాలా సీరియస్‌గా సింగింగ్ ప్రాక్టీస్ చేస్తోంది. దాన్ని మొబైల్ కెమెరాలో వీడియో తీస్తుంది. ఆమె పైన సీలింగ్ శబ్దం చేస్తూ కూలింది. కూలిన సీలింగ్ నుంచి తల్లి కింద పడింది. ఆమె కాలుకు బలమైన గాయమైందని సోషల్ మీడియాలో కూతురు రాసుకొచ్చింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది.Updated Date - 2020-09-04T00:06:33+05:30 IST