సీఎం కార్యాలయం ఎదుట ఒంటికి నిప్పంటిచుకున్న తల్లీకూతుళ్లు!

ABN , First Publish Date - 2020-07-18T18:55:44+05:30 IST

పోలీసుల నిర్లిప్తతతో విసిగి వేసారిన తల్లీకూతుళ్లు ఏకంగా ఉత్తరప్రదేవ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కార్యాలయం ముందు ఒంటికి నిప్పటించుకుని ఆత్మహత్యయత్నం చేశారు.

సీఎం కార్యాలయం ఎదుట ఒంటికి నిప్పంటిచుకున్న తల్లీకూతుళ్లు!

లక్నో: పోలీసుల నిర్లిప్తతతో విసిగి వేసారిన తల్లీకూతుళ్లు ఏకంగా ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కార్యాలయం ముందే ఒంటికి నిప్పటించుకుని ఆత్మహత్యయత్నం చేశారు. వారికి తీవ్రగాయాలవడంతో అక్కడున్న పోలీసులు ఆ తల్లీకూతుళ్లను వెంటనే ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం సాయంత్రం 6 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. ఓ భూ వివాదానికి సంబంధించి పోలీసులు తగు చర్యలు తీసుకోవట్లేదనేది వారి ఆరోపణ అని సమాచారం. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అమెథీలోని జమావ్ ప్రాంతలో ఓ భూవివాదాని సంబంధించి వారు గతంలో ఫిర్యాదు చేసినట్టు స్థానిక పోలీసులు తెలిపారు.‘సీఎం కార్యాలయంలో ఎవరినీ సంప్రదించకుండానే వారు వీధిలో ఒంటికి నిప్పంటికున్నారు’ అని సీనియర్ పోలీసు అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఈ విషయంలో దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు.  

Updated Date - 2020-07-18T18:55:44+05:30 IST