సూసైడ్ చేసుకొన్న యువతి.. ఆ మరుసటి రోజు దానిపై ఇన్‌స్టా పోస్టు!

ABN , First Publish Date - 2020-12-27T09:46:48+05:30 IST

అమెరికాకు చెందిన ఓ 24 ఏళ్ల యువతి ఆత్మహత్య చేసుకుంది. అయితే ఆ తర్వాత ఆమె చేసిన పనే అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎందుకంటే.. ఆమె మరణించిన తర్వాత సదరు యువతి ఇన్‌స్టా ఖాతాలో ఓ పోస్టు ప్రత్యక్షం అయింది

సూసైడ్ చేసుకొన్న యువతి.. ఆ మరుసటి రోజు దానిపై ఇన్‌స్టా పోస్టు!

న్యూయార్క్: అమెరికాకు చెందిన ఓ 24 ఏళ్ల యువతి ఆత్మహత్య చేసుకుంది. అయితే ఆ తర్వాత ఆమె చేసిన పనే అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎందుకంటే.. ఆమె మరణించిన తర్వాత సదరు యువతి ఇన్‌స్టా ఖాతాలో ఓ పోస్టు ప్రత్యక్షం అయింది. దీంతో అసలేమైందా? అని దర్యాప్తు ప్రారంభం అయింది. అమెరికాకు చెందిన ఓ యువతి.. 150 అడుగుల ఎత్తయిన ఓ షిప్ బొమ్మపై నుంచి కిందకు దూకేసింది. దీంతో తీవ్రంగా గాయపడిన ఆమె మరణించింది. అయితే ఆ మరుసటి రోజే ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు పేర్కొంటూ ఆమె ఇన్‌స్టా అకౌంట్‌లో ఓ పోస్టు ప్రత్యక్షం అయింది. దీన్ని ఆత్మహత్య చేసుకోవడానికి ముందే సదరు యువతే రాసిందని తేలింది. అయితే ఇన్‌స్టాలో పోస్టు చేసేముందుగానే దాన్ని తన మరణం తర్వాత పోస్టయ్యేలా ఆమె షెడ్యూల్ చేసింది. ‘‘నాకు ఎటువంటి కష్టాలూ లేవని తెలిసి సంతోషిస్తారని భావిస్తున్నా’’ అని ఆమె పోస్టు పెట్టింది.

Updated Date - 2020-12-27T09:46:48+05:30 IST