చారిత్రక ఘట్టాలకు సాక్షి

ABN , First Publish Date - 2020-12-11T09:20:45+05:30 IST

పార్లమెంటు ప్రస్తుత భవనానికి దేశ చరిత్రలో విశేష స్థానం ఉంది. అనేక చారిత్రక ఘట్టాలకు వేదికగా నిలిచింది. బ్రిటిష్‌ పాలకుల నుంచి ప్రస్తుత మోదీ సర్కారు వరకు రూపొందించిన చట్టాలు, కీలక చర్చలకు ఈ భవనం సాక్షిగా నిలిచింది.

చారిత్రక ఘట్టాలకు సాక్షి

పార్లమెంటు ప్రస్తుత భవనం విశేషాలివీ


న్యూఢిల్లీ, డిసెంబరు 10: పార్లమెంటు ప్రస్తుత భవనానికి దేశ చరిత్రలో విశేష స్థానం ఉంది. అనేక చారిత్రక ఘట్టాలకు వేదికగా నిలిచింది. బ్రిటిష్‌ పాలకుల నుంచి ప్రస్తుత మోదీ సర్కారు వరకు రూపొందించిన చట్టాలు, కీలక చర్చలకు ఈ భవనం సాక్షిగా నిలిచింది. పార్లమెంటు నూతన భవనానికి గురువారం శంకుస్థాపన చేసిన సందర్భంగా ప్రస్తుత భవ నం విశేషాలు..


బ్రిటిష్‌ పాలనలో ఐకానిక్‌ వృత్తాకార పార్లమెంటు భవనాన్ని నిర్మించారు. 


న్యూఢిల్లీని నిర్మించిన ఎడ్విన్‌ లుటియెన్స్‌, హెర్బె ర్ట్‌ బేకర్‌ ఈ భవనం డిజైన్‌ను రూపొందించారు.

 

1921 ఫిబ్రవరి 12న శంకుస్థాపన. భవన నిర్మాణానికి ఆరేళ్లు పట్టింది. నిర్మాణ వ్యయం రూ.83 లక్షలు. భవనం వ్యాసం 560 అడుగులు. 


మొదటి అంతస్తులోని వరండాను 27 అడుగులున్న 144 సున్నపురాతి స్తంభాలతో నిర్మించారు.


వృత్తాకారంలోని అతిపెద్ద సెంట్రల్‌ హాల్‌ ఈ భవనం ప్రత్యేకత. సెంట్రల్‌హాల్‌కు 3 వైపులా లోక్‌సభ, రాజ్యసభ, లైబ్రరీ హాల్‌ ఉండగా, మధ్యమధ్యలో తోటలున్నాయి.


స్వదేశీ మెటీరియల్‌, భారత కార్మికులతో నిర్మిం చిన ఈ భవనం భారత సంస్కృతికి నిదర్శనం.


1927 జనవరి 18న అప్పటి భారత గవర్నర్‌ జనరల్‌ లార్డ్‌ ఇర్విన్‌ చేతుల మీదుగా ప్రారంభం.


చారిత్రక చర్చలు, ముఖ్యమైన చట్టాలు, అంత్యంత శక్తిమంతమైన భారత ప్రజాస్వామ్యానికి ఈ భవనం సాక్షిగా నిలిచింది. 


బ్రిటిష్‌ పాలకుల నుంచి అధికార మార్పిడి పార్లమెంటు సెంట్రల్‌ హాల్‌లోనే జరిగింది. 1947 ఆగస్టు 14న అర్ధరాత్రి నాటి భారత ప్రధాని నెహ్రూ ఈ భవనం నుంచే ప్రసంగించారు. 

భారత రాజ్యాంగాన్ని కూడా ఈ సెంట్రల్‌ హాల్‌లోనే రూపొందించారు. రాజ్యాంగం ఉనికిలోకి వచ్చింది కూడా ఈ భవనంలోనే. 


భారత రాజ్యాంగ సభ కూడా ఇదే భవనంలో 1946 డిసెంబరు 9 నుంచి 1950 జనవరి 24 వరకు కొనసాగింది.


సుప్రీంకోర్టును 1950లో ఏర్పాటు చేయగా, ఆ ఏడాది జనవరి 28 నుంచి పార్లమెంటు లైబ్రరీ హాల్‌లోనే కోర్టు కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. సుప్రీంకోర్టు ప్రస్తుత భవనం నిర్మించే (1958) వరకు ఈ హాల్‌లోనే కొనసాగింది. 


బ్రిటిష్‌ పాలకుల కళ్లు తెరిపించడానికి భగత్‌ సింగ్‌ బాంబులు విసిరింది కూడా ఇక్కడే. 


2001లో లష్కరే తాయిబా, జైషే మొహమ్మద్‌ ఉగ్రవాదులు ఈ భవనంపై దాడికి పాల్పడగా 9 మంది మరణించారు.

Updated Date - 2020-12-11T09:20:45+05:30 IST