కలుపు మొక్కతో.. రొమ్ము కేన్సర్‌కు చెక్‌

ABN , First Publish Date - 2020-10-31T07:38:56+05:30 IST

నిన్నమొన్నటి వరకు అది ఒట్టి కలుపు మొక్కే. ఇప్పుడది రొమ్ము కేన్సర్‌పై ఉక్కుపాదం మోపగల దివ్య ఔషధి.

కలుపు మొక్కతో.. రొమ్ము కేన్సర్‌కు చెక్‌

కేన్సర్‌ కణాల పెరుగుదలను నిలువరించే ‘థేల్‌ క్రెస్‌’

లండన్‌, అక్టోబరు 30 : నిన్నమొన్నటి వరకు అది ఒట్టి కలుపు మొక్కే. ఇప్పుడది రొమ్ము కేన్సర్‌పై ఉక్కుపాదం మోపగల దివ్య ఔషధి. అరబిడోప్సిస్‌ థాలియానా లేదా థేల్‌ క్రెస్‌ మొక్కలో రొమ్ము కేన్సర్‌ కణాల పెరుగుదలను నిలువరించే ఔషధ గుణాలు ఉన్నాయని యూనివర్సిటీ ఆఫ్‌ లండన్‌ శాస్త్రవేత్తలు గుర్తించారు. కీమోథెరపీలో కేన్సర్‌ కణాలతో పాటు ఆ భాగంలోని సాధారణ కణాలు కూడా నశిస్తాయి.


ఈ లోపాన్ని అధిగమించేలా థేల్‌ క్రెస్‌ మొక్క పనిచేస్తుంది. ఇది కేన్సర్‌ కణాల పెరుగుదలను నిరోధిస్తుంది. కానీ సాధారణ కణాల జోలికి మాత్రం పోదు. తద్వారా చికిత్స వల్ల కేన్సర్‌ రోగి ఆరోగ్యపరంగా బలహీనపడే అవకాశాలు చాలావరకు తగ్గుతాయి. 


Read more