ఈరోజు కొత్తగా 80 కరోనా కేసులు.. మొత్తం 1200

ABN , First Publish Date - 2020-03-31T01:06:12+05:30 IST

ఇక ప్రపంచ డేటా విషయానికి వస్తే ఇప్పటి వరకు 7,40,235 కరోనా కేసులు నమోదు అయినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. కాగా కరోనా వల్ల 35,035 మరణించగా 1,56,588 మంది కరోనా నుంచి కోరుకున్నారు

ఈరోజు కొత్తగా 80 కరోనా కేసులు.. మొత్తం 1200

న్యూఢిల్లీ: మిగతా దేశాల మాట ఎలా ఉన్నా ఇండియాలో మాత్రం కరోనా కంట్రోల్‌లోనే ఉందని చెప్పవచ్చు. కరోనా కేసులు రోజులో వందలోపు నమోదు అవుతున్నప్పటికీ వాటిలో పెరుగుదల పెద్దగా ఏమీ కనిపించడం లేదు. ఈరోజు కొత్తగా 80 కరోనా కేసులు నమోదైనట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అయితే వీటితో కలిపి దేశంలో మొత్తం కేసులు 1200 చేరువకు వెళ్లింది. 1,170 పైగానే కరోనా కేసులు నమోదు అయ్యాయని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ఇదిలా ఉంటే కరోనా వల్ల ఇప్పటి వరకు 33 మంది మరణించారు.


ఇక ప్రపంచ డేటా విషయానికి వస్తే ఇప్పటి వరకు 7,40,235 కరోనా కేసులు నమోదు అయినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. కాగా కరోనా వల్ల 35,035 మరణించగా 1,56,588 మంది కరోనా నుంచి కోరుకున్నారు.

Updated Date - 2020-03-31T01:06:12+05:30 IST