మద్యం అమ్మకాలకు అనుమతివ్వండి.. సీఎంను కోరిన డీలర్లు

ABN , First Publish Date - 2020-04-05T15:49:40+05:30 IST

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర 21 రోజులపాటు విధించిన లాక్‌డౌన్ నేపథ్యంలో దేశ్వవ్యాప్తంగా మద్యంషాపులు మూతపడ్డాయి. గత కొద్ది రోజులుగా మద్యం

మద్యం అమ్మకాలకు అనుమతివ్వండి.. సీఎంను కోరిన డీలర్లు

షిల్లాంగ్: కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర 21 రోజులపాటు విధించిన లాక్‌డౌన్ నేపథ్యంలో దేశ్వవ్యాప్తంగా మద్యంషాపులు మూతపడ్డాయి. గత కొద్ది రోజులుగా మద్యం దొరకకపోవడంతో మందుబాబులకు పిచ్చెక్కిపోతుంది. ఈ కారణంగా కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు. 


అయితే తమకు మద్యంషాపులు తెరిచేందుకు తమకు అనుమతి ఇవ్వాలని మేఘాలయాలోని ఈస్ట్ కాశీ హిల్స్‌ జిల్లాకు చెందిన మద్యంషాపు డీలర్లు సీఎం కోన్రడ్ కే సంగ్మాను కరోరు. ఈ మేరకు వాళ్లు సీఎంకు ఓ లేఖ రాశారు. మద్యం కావాలంటూ.. మందుబాబులు తమపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకొస్తున్నారని వాళ్లు లేఖలో పేర్కొన్నారు. 


‘‘ప్రజల నుంచి తీవ్రస్థాయిలో ఒత్తిడి వస్తుంది. మద్యం అమ్మమంటూ మాకు ఫోన్లు మీద ఫోన్లు చేస్తున్నారు. మేఘాలయాలోని చాలా మందికి మద్యం తీసుకోవడం.. జీవనంలో భాగంగా మారింది. ఒక్కసారిగా దుకాణాలు మూతపడటంతో.. ఒక్కసారిగా మద్యం అమ్మాలంటూ డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. కాబట్టి భౌతిక దూరం, పౌరుల శుభ్రత అన్నిటికి కట్టుబడి ఉంటూ మేము మద్యం అమ్మకాలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నాం’’ అని డీలర్లు లేఖలో పేర్కొన్నారు. 

Updated Date - 2020-04-05T15:49:40+05:30 IST