మద్యం మత్తులో చెల్లిని హతమార్చిన అన్న

ABN , First Publish Date - 2020-05-09T13:53:33+05:30 IST

మద్యం మత్తులో తన చెల్లిపై కర్రతో దాడి చేసి ఓ ప్రబుద్ధుడు హతమార్చాడు. పోలీసుల కథనం మేరకు...

మద్యం మత్తులో చెల్లిని హతమార్చిన అన్న

చెన్నై: మద్యం మత్తులో తన చెల్లిపై కర్రతో దాడి చేసి ఓ ప్రబుద్ధుడు హతమార్చాడు. పోలీసుల కథనం మేరకు... విరుదునగర్‌ జిల్లా శీర్గాళి సమీపం కీళక్కడైమంగలత్తై గ్రామానికి చెందిన చంద్రమతికి కుమారుడు గణేష్‌బాబు(23), ముగ్గురు కుమార్తెలున్నారు. ఒక కుమార్తె హంసవల్లి(20) రాజపాళయంలోని కళాశాలలో నర్సింగ్‌ రెండో సంవత్సరం చదువుతోంది.  కాగా ఓ యువకుడిని ఆమె ప్రేమించిందని తెలిసి గణేష్‌బాబు ఆమెను హెచ్చరించాడు. కాగా గురువారం మద్యం దుకాణాలు తెరవడతో మద్యం తాగి సాయంత్రం ఇంటికి వచ్చిన గణేష్‌ చెల్లెలితో గొడవకు దిగాడు. కట్టెతో చెల్లెలుపై తీవ్రంగా దాడి చేశాడు. దీంతో హంసవల్లి మృతి చెందిందని గమనించి గణేష్‌  పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించి, కేసు దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2020-05-09T13:53:33+05:30 IST