వర్క్ ఫ్రమ్ హోమ్ ఇకపై శాశ్వతం?

ABN , First Publish Date - 2020-04-21T13:27:48+05:30 IST

కరోనా విపత్తు తొలగిన తరువాత ప్రపంచంలో చాలా మార్పులు చోటుచేసుకోనున్నాయి. ముఖ్యంగా పనిచేసే శైలిలోమార్పులు రానున్నాయి.

వర్క్ ఫ్రమ్ హోమ్ ఇకపై శాశ్వతం?

న్యూఢిల్లీ: కరోనా విపత్తు తొలగిన తరువాత ప్రపంచంలో చాలా మార్పులు చోటుచేసుకోనున్నాయి. ముఖ్యంగా పనిచేసే శైలిలో మార్పులు రానున్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇంటి నుండి పని(వర్క్ ఫ్రమ్ హోమ్) అనేది  శాశ్వతంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం కూడా దీనిని గ్రహించింది. త్వరలో కేంద్ర ప్రభుత్వం ఇంటి నుండి పనికి సంబంధించిన  మార్గదర్శకాలను జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ లేదా ప్రభుత్వేతర సంస్థలలో పనిచేసే ఉద్యోగుల ప్రయోజనాలను పరిరక్షించడానికి పని గంటలు, పని వాతావరణం, జీతం మొదలైన వాటికి సంబంధించిన ప్రమాణాలను కేంద్ర ప్రభుత్వం నిర్దేశిస్తుంది. ఇంటి నుండి పనిచేసే విధానం విస్తృతంగా ఉంటే, ప్రత్యేక మార్గదర్శకాలు అవసరమని ప్రభుత్వానికి అనుబంధంగా ఉన్న ఒక సీనియర్ అధికారి మీడియాకు తెలిపారు. ప్రస్తుత కార్మిక చట్టంలో దీనికి నిర్దిష్ట మార్గదర్శకాలు లేవు. లాక్డౌన్ అమలు సందర్భంగా పీఎం మోదీ... దేశంలోని  కంపెనీలు వారి  ఉద్యోగులను ఇంటి నుండే పని చేయడానికి అనుమతించాలని కోరారు. 

Updated Date - 2020-04-21T13:27:48+05:30 IST