రుణాలపై... మారటోరియం పొడిగింపు ఉంటుందా ?

ABN , First Publish Date - 2020-07-28T00:49:05+05:30 IST

కరోనా నేపధ్యంలో... రుణాలపై ఈ ఏడాది మార్చి నుండి ఏప్రిల్ వరకు ‘మారటోరియం’ వెసులుబాటు కల్పించిన విషయం తెలిసిందే. కాగా... దీనిని డిసెంబర్ వరకు(ఐదు నెలలు), లేదా మంత్తంగా మరో ఆరు నెలలు పొడిగించనున్నారా ? వివిధ వర్గాల నుంచి ఇందుకు ‘అవును’ అన్న సమాధానమే వినవస్తోంది.

రుణాలపై... మారటోరియం పొడిగింపు ఉంటుందా ?

ముంబై : కరోనా నేపధ్యంలో... రుణాలపై ఈ ఏడాది మార్చి నుండి ఏప్రిల్ వరకు ‘మారటోరియం’ వెసులుబాటు కల్పించిన విషయం తెలిసిందే.  కాగా... దీనిని డిసెంబర్ వరకు(ఐదు నెలలు), లేదా మొత్తంగా మరో ఆరు నెలలు పొడిగించనున్నారా ? వివిధ వర్గాల నుంచి ఇందుకు ‘అవును’ అన్న సమాధానమే వినవస్తోంది.


మారటోరియంను పొడిగించాలంటూ... ఎంఎస్ఎంఈలు సహా వివిధ వర్గాల నుండి గత కొద్ది నెలలుగా విజ్ఞప్తులు తారస్థాయిలో వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో... లోన్ మారటోరియంపై  ఏమైనా కీలక నిర్ణయం తీసుకోవచ్చని వినవస్తోంది.


కాగా... ఆర్థిక వ్యవస్థలు కోలుకుంటున్నందున లోన్ మారటోరియం పొడిగింపు అవసరం లేదన్న అభిప్రాయాలు కూడా బ్యాంకింగ్ వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి. 

Updated Date - 2020-07-28T00:49:05+05:30 IST