విమానంలో ప్రోటోకాల్‌ నిబంధనలను ఉల్లంఘింస్తే కఠిన చర్యలు: డీజీసీఏ

ABN , First Publish Date - 2020-09-12T22:02:51+05:30 IST

విమానంలో ప్రోటోకాల్‌ నిబంధనలను ఉల్లంఘింస్తే కఠిన చర్యలు: డీజీసీఏ

విమానంలో ప్రోటోకాల్‌ నిబంధనలను ఉల్లంఘింస్తే కఠిన చర్యలు: డీజీసీఏ

న్యూఢిల్లీ: భద్రతా ప్రోటోకాల్‌ నిబంధనలను ఉల్లంఘింస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీజీసీఏ హెచ్చరించింది. ఎవరైనా విమానం లోపల ఫోటోగ్రఫీ చేస్తున్నట్లు కనిపిస్తే 2 వారాల పాటు విమాన ప్రయాణాన్ని నిలిపివేస్తామని డీజీసీఏ ప్రకటించింది. ఎవరైనా ప్రోటోకాల్‌ నిబంధనలను ఉల్లంఘించినట్లు, విమానం లోపల ఫోటోగ్రఫీ చేస్తున్నట్లు గుర్తించబడితే షెడ్యూల్ చేసిన విమానాన్ని రెండు వారాల పాటు నిలిపివేస్తామని డీజీసీఏ శనివారం తెలిపింది. కంగనా రనౌత్ ఉన్న విమానంలో మీడియా వ్యక్తులు భద్రతా ప్రోటోకాల్‌లను ఉల్లంఘించారనే ఆరోపణలపై డీజీసీఏ ఇండిగో విమానయాన సంస్థలను కోరిన తరువాత ఇది జరిగింది. ఈ సంఘటన బుధవారం చండీగడ్ -ముంబై విమానంలో జరిగింది.

Updated Date - 2020-09-12T22:02:51+05:30 IST