సూట్‌బూట్ సర్కారుకు పేద ప్రజల బాధలు అర్థమవుతున్నాయా? రాహుల్

ABN , First Publish Date - 2020-08-11T22:22:58+05:30 IST

సూట్ బూట్, లూట్ సర్కారుకు పేద ప్రజల బాధలు అర్థమవుతున్నాయా? అని కాంగ్రెస్ ఎంపీ రాహుల్

సూట్‌బూట్ సర్కారుకు పేద ప్రజల బాధలు అర్థమవుతున్నాయా? రాహుల్

న్యూఢిల్లీ : సూట్ బూట్, లూట్ సర్కారుకు పేద ప్రజల బాధలు అర్థమవుతున్నాయా? అని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సూటిగా ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన నరేగాతో పాటు... ప్రతిపాదించిన న్యాయ్ పథకాలను కేంద్రం అమలు చేయడం అత్యావశ్యకమని ఆయన పేర్కొన్నారు. కరోనా కారణంగా నిరుద్యోగితతో బాధపడుతున్న వారికి ఈ రెండూ ఎంతో ఉపయోగపడతాయని ఆయన తెలిపారు. పేదలతో పాటు భారత ఆర్థిక వ్యవస్థకు కూడా ఈ రెండు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు.


‘‘కరోనా కారణంగా నిరుద్యోగితతో బాధపడుతున్న వారికి నరేగా పథకం అత్యావశ్యకం. దీనిని కేంద్రం కచ్చితంగా అమలు చేయాలి. ఇక, దేశంలోని పేద ప్రజలకు న్యాయ్ పథకం అమలు చేసి ఆదుకోవాలి.’’ అని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. 

Updated Date - 2020-08-11T22:22:58+05:30 IST