జులై 31 నుంచి పాఠశాలల పునర్ ప్రారంభంపై సీఎం సమీక్ష

ABN , First Publish Date - 2020-06-23T14:35:13+05:30 IST

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జులై 31వతేదీ నుంచి పాఠశాలలు పునర్ ప్రారంభించడంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధికారులతో సమీక్షించారు....

జులై 31 నుంచి పాఠశాలల పునర్ ప్రారంభంపై సీఎం సమీక్ష

భోపాల్ (మధ్యప్రదేశ్): మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జులై 31వతేదీ నుంచి పాఠశాలలు పునర్ ప్రారంభించడంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధికారులతో సమీక్షించారు. కరోనా వైరస్ ప్రబలిన నేపథ్యంలో పాఠశాలలను మూసివేశారు. పాఠశాలలు జులై 31 నుంచి పునర్ ప్రారంభిస్తే, గతంలో వివిధ కారణాల వల్ల 12వతరగతి పరీక్ష రాయలేక పోయిన విద్యార్థులకు మళ్లీ పరీక్ష రాసే అవకాశం కల్పిస్తామని సీఎం శివరాజ్ సింగ్ చెప్పారు. కరోనా స్థితిగతులను సమీక్షించిన తర్వాత జులై 31 వతేదీ నుంచి పాఠశాలలను పునర్ ప్రారంభించే విషయంలో తుది నిర్ణయం తీసుకుంటామని సీఎం చెప్పారు.

Read more