ఆ వ్యాక్సీన్ పనిచేస్తే.. అందరికీ ఫ్రీ: ప్రధాని ప్రకటన!

ABN , First Publish Date - 2020-08-19T04:20:39+05:30 IST

ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న కరోనా వైరస్‌ను ఓడించడానికి చాలా దేశాలు ప్రయత్నిస్తున్నాయి. దీన్ని నివారించే వ్యాక్సీన్ తయారీ కోసం రకరకాల ప్రయోగాలు చేస్తున్నాయి.

ఆ వ్యాక్సీన్ పనిచేస్తే.. అందరికీ ఫ్రీ: ప్రధాని ప్రకటన!

కాన్‌బెర్రా: ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న కరోనా వైరస్‌ను ఓడించడానికి చాలా దేశాలు ప్రయత్నిస్తున్నాయి. దీన్ని నివారించే వ్యాక్సీన్ తయారీ కోసం రకరకాల ప్రయోగాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో బ్రిటిష్-స్వీడిష్ ఫార్మా సంస్థ ఆస్ట్రాజెనెకా కూడా ఓ కరోనా వ్యాక్సీన్‌పై ప్రయోగాలు చేస్తోంది. ఈ వ్యాక్సీన్‌ కోసం ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇప్పటికే సదరు ఫార్మా సంస్థతో ఒప్పందం చేసుకున్నట్లు ఆసీస్ ప్రధాని స్కాట్ మారిసన్ వెల్లడించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘ఈ డీల్ ప్రకారం, ప్రతి ఆస్ట్రేలియన్‌కూ వ్యాక్సీన్ అందుతుంది. ఈ వ్యాక్సీన్ ప్రయోగం విజయవంతం అయితే.. ప్రతి ఆస్ట్రేలియన్‌కూ అందేలా మనమే ఉత్పత్తి చేసుకునేలా ఒప్పందం చేసుకున్నాం’ అని మారిసన్ చెప్పారు. అలాగే దేశంలోని 25మిలియన్ల జనాభాకు ఉచితంగా వ్యాక్సీన్ అందించాలని తాము భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

Updated Date - 2020-08-19T04:20:39+05:30 IST