సుప్రీంలో రివ్యూ పిటిషన్‌ వేస్తా : ప్రశాంత్‌ భూషణ్‌

ABN , First Publish Date - 2020-08-20T07:03:59+05:30 IST

న్యాయ వ్యవస్థను అప్రతిష్ఠపాల్జేసే విధంగా వ్యాఖ్య లు చేసిన కేసులో దోషిగా తేలిన సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాను రివ్యూ పిటిషన్‌ దాఖలు చేస్తానని...

సుప్రీంలో రివ్యూ పిటిషన్‌ వేస్తా : ప్రశాంత్‌ భూషణ్‌

న్యూఢిల్లీ, ఆగస్టు 19: న్యాయ వ్యవస్థను అప్రతిష్ఠపాల్జేసే విధంగా వ్యాఖ్య లు చేసిన కేసులో దోషిగా తేలిన సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాను రివ్యూ పిటిషన్‌ దాఖలు చేస్తానని, దానిపై విచారణ పూర్తయ్యేదాకా తనపై సుప్రీంకోర్టు చర్యలను వాయిదా వేయాలని ఆయన కోరారు. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం తీర్పు వచ్చిన 30 రోజుల్లోగా అప్పీలు దాఖలు చేసుకునే హక్కు ఉన్నందున... అప్పటిదాకా శిక్ష ఖరారుపై వాదనలు వాయిదా వేయాల్సిందిగా ఆయన కోరారు. 

Read more