దేశంలో ప్రతి మూలకూ కరోనా వ్యాక్సీన్ చేరవేస్తాం: నీతా అంబానీ

ABN , First Publish Date - 2020-07-16T04:54:27+05:30 IST

కరోనా వ్యాక్సీన్ తయారైతే దేశంలో నలుమూలలకూ అది చేరేలా చర్యలు తీసుకుంటామని నీతా అంబానీ హామీఇచ్చారు.

దేశంలో ప్రతి మూలకూ కరోనా వ్యాక్సీన్ చేరవేస్తాం: నీతా అంబానీ

ముంబై: కరోనా వ్యాక్సీన్ తయారైతే దేశంలో నలుమూలలకూ అది చేరేలా చర్యలు తీసుకుంటామని నీతా అంబానీ హామీఇచ్చారు. బుధవారం జరిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ యాన్యువల్ జనరల్ మీటింగ్‌‌లో పాల్గొన్న ఆమె ఈ మేరకు ఓ ప్రకటన చేశారు. ఇలా రిలయన్స్ వార్షిక సమావేశాల్లో ఆమె పాల్గొనడం ఇదే తొలిసారి. కరోనా వ్యాక్సీన్ సిద్ధమైతే దేశంలో అన్ని మూలలకూ అది అందేలా రిలయన్స్ సంస్థలు బాధ్యత తీసుకుంటాయని ఆమె చెప్పారు. ఈ వ్యాక్సీన్ డిజిటల్ డిస్ట్రిబ్యూషన్, సప్లై చైన్‌ మెయింటైన్ చేయడానికి తమ సంస్థ వాలంటీర్‌గా ముందుకొస్తుందని స్పష్టంచేశారు. చివరగా కరోనాతో మన యుద్ధం ఇంకా ముగియలేదని నీతా పేర్కొన్నారు.

Updated Date - 2020-07-16T04:54:27+05:30 IST