రేషన్ డీలర్లు మానవత్వం చూపించాలి... తేడా వచ్చిందో.. : సీఎం వార్నింగ్

ABN , First Publish Date - 2020-03-31T01:08:28+05:30 IST

ప్రజలకు ఇవ్వాల్సిన రేషన్ విషయంలో తేడా వచ్చినా, బ్లాక్ మార్కెట్‌కు తరలించినట్టు తేలినా డీలర్లపై ..

రేషన్ డీలర్లు మానవత్వం చూపించాలి... తేడా వచ్చిందో.. : సీఎం వార్నింగ్

న్యూఢిల్లీ: ప్రజలకు ఇవ్వాల్సిన రేషన్ విషయంలో ఏమాత్రం తేడా వచ్చినా, బ్లాక్ మార్కెట్‌కు తరలించినట్టు తేలినా డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ హెచ్చరించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘రేషన్ డీలర్లకు ఒక్కటే చెప్పదల్చుకున్నాను.. మీరు మానవత్వాన్ని నిరూపించుకునే సమయం వచ్చింది. ఒక వేళ ఎక్కడైనా తప్పు జరిగితే కఠిన చర్యలు తప్పవని కూడా స్పష్టం చేస్తున్నా. ఈ విషయంలో ఎవర్నీ వదిలిపెట్టేది లేదు..’’ అని పేర్కొన్నారు. కాగా జానక్ పురిలో వచ్చిన ఆరోపణలపై ఓ రేషన్ డీలర్‌ను అరెస్టు చేయాలంటూ ఆదేశించిన కొద్ది సేపటికే కేజ్రీవాల్ ఈ మేరకు స్పందించడం గమనార్హం. 

Updated Date - 2020-03-31T01:08:28+05:30 IST