రోడ్లపై తిరిగే ఆవుల కోసం 2,000 కొత్త షెల్టర్లు: సీఎం చౌహాన్

ABN , First Publish Date - 2020-11-23T00:50:40+05:30 IST

రోడ్లపై తిరిగే ఆవుల కోసం 2,000 కొత్త షెల్టర్లు: సీఎం చౌహాన్

రోడ్లపై తిరిగే ఆవుల కోసం 2,000 కొత్త షెల్టర్లు: సీఎం చౌహాన్

భోపాల్: రోడ్లపై విచ్చల విడిగా తిరిగే ఆవుల కోసం ప్రత్యేకంగా షెల్టర్లు కట్టించనున్నట్లు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. అనంతరం ఈ కౌ షెల్టర్లల నుంచి పాల ఉత్పత్తిని చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న పౌష్టికాహార లోపాల్ని అధిగమించడానికి వీటిని ఉపయోగించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో సుమారుగా 7 నుంచి 8 లక్షల ఆవులు రోడ్లపై ఉన్నాయని.. వాటి కోసం 2,000 ‘కౌ షెల్టర్ల’ను ప్రభుత్వం నిర్మించనున్నారట. ఇక కౌ షెల్టర్లన్నిటి నిర్వహణను ప్రభుత్వం చూసుకోదని, కొన్నింటిని ఎన్‌జీఓలకు అప్పగించనున్నట్లు చౌహాన్ తెలిపారు. ఇక రాష్ట్రంలో రాష్ట్రంలో పౌష్టికాహార లోపంపై ఆయన మాట్లాడుతూ ‘‘రాష్ట్రంలో చాలా మంది చిన్నారులు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. ఇక నుంచి వారందరికీ ఆవు పాలు అందిస్తాం. అయితే ఇప్పటి వరకు ఇస్తున్న కోడిగుడ్లను రద్దు చేస్తాం. వాటి స్థానంలో ఆవు పాలు ఇస్తాం’’ అని అన్నారు.

Updated Date - 2020-11-23T00:50:40+05:30 IST