పాక్ విన్నపాన్ని పరిశీలిస్తాం: ఐఎమ్ఎఫ్

ABN , First Publish Date - 2020-03-29T00:59:41+05:30 IST

ఓ పక్కన కుంటుతున్న ఆర్థిక వ్యవస్థ, మరోపక్క తరిగిపోతున్న విదేశీ మారకంతో దిక్కుతోచని స్థితిలో ఉణ్న పాక్.. ఆర్థిక సాయం కోసం అంతర్జాతీయ ద్రవ్యనిధిని ఆశ్రయించింది. దీనిపై స్పందించిన ఐఎమ్ఎఫ్..పాక్ విన్నపాన్ని పరిశీలిస్తామని తెలిపింది.

పాక్ విన్నపాన్ని పరిశీలిస్తాం: ఐఎమ్ఎఫ్

ఇస్లామాబాద్: గోరుచుట్టుపై రోకలి పోట్టు అన్నట్టుగా పాకిస్థాన్ పరిస్థితి తయారైంది. అసలే అర్థికంగా కుంటున్న పాకిస్తాన్‌కు కరోనా రూపంలో భారీ సవాలు ఎదురైంది. ఓ పక్కన దిగజారుతున్న ఆర్థిక వ్యవస్థ, మరోపక్క తరిగిపోతున్న విదేశీ మారకంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న పాక్.. ఆర్థిక సాయం కోసం అంతర్జాతీయ ద్రవ్యనిధిని(ఐఎమ్ఎఫ్) ఆశ్రయించింది. త్వరత గతిన నిధులు అందించే ర్యాపిడ్ ఫైనాన్సింగ్ ఇన్‌స్ట్రూమెంట్ విధానం ద్వారా పాక్‌కు వెంటనే నిధులు విడుదల చేయాలని కోరింది. దీనిపై స్పందించిన ఐఎమ్ఎఫ్..పాక్ విన్నపాన్ని పరిశీలిస్తామని తెలిపింది. ‘పాక్ విన్నపాన్ని ఓ బృందం పరిశీలిస్తోంది. వీలైనంత తొందరగా దీన్ని ఐఎమ్ఎఫ్ బోర్డు ముందుకు తీసుకెళతాం’ అని ఐఎమ్ఎఫ్ మ్యానేజింగ్ డైరెక్టర్ క్రిస్టలీనా జార్జియా ఓ ప్రకటన విడుదల చేశారు. 


Updated Date - 2020-03-29T00:59:41+05:30 IST