భార్య తన భర్త ఆదాయం గురించి సమాచారం పొందవచ్చు...

ABN , First Publish Date - 2020-11-19T15:10:55+05:30 IST

సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ద్వారా భార్య తన భర్త స్థూల ఆదాయం గురించి సమాచారం పొందవచ్చని ....

భార్య తన భర్త ఆదాయం గురించి సమాచారం పొందవచ్చు...

కేంద్ర సమాచార కమిషన్ నిర్ణయం

ఢిల్లీ : సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ద్వారా భార్య తన భర్త స్థూల ఆదాయం గురించి సమాచారం పొందవచ్చని కేంద్ర సమాచార కమిషన్(సీఐసీ) అభిప్రాయ పడింది. భార్య మూడవ పార్టీకి చెందినదని, ఐటీ విభాగం తీసుకున్న నిర్ణయాన్ని సీఐసీ తిరస్కరించింది. రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్ పూర్ నగరానికి చెందిన రహమత్ బానో దాఖలు చేసిన అప్పీలుపై కేంద్ర సమాచార కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది. భర్త ఆదాయం గురించి భార్య సమాచారం తెలుసుకోవడం సమాచార హక్కుకు సంబంధించినది కాదని ఆదాయపు పన్ను శాఖ వాదనను సీఐసీ తప్పుపట్టింది. మహిళ రహమత్ బానోకు 15రోజుల్లోగా భర్త ఆదాయం గురించి సమాచారం అందించాలని కమిషన్ జోద్ పూర్ ఐటీ విభాగం అధికారులను ఆదేశించింది. ప్రభుత్వ ఉద్యోగుల భార్యలకు వారి భర్తల జీతాల వివరాలను తెలుసుకునే హక్కు ఉందని కేంద్ర సమాచార కమిషన్ 2014లో పేర్కొంది. 

Updated Date - 2020-11-19T15:10:55+05:30 IST