నిరాయుధుల్ని పంపారు.. బాధ్యులెవరు? రాహుల్ ఫైర్
ABN , First Publish Date - 2020-06-18T19:30:13+05:30 IST
గాల్వన్ లోయలో 20 మంది సైనికులు వీర మరణం పొందిన ఘటనపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై
న్యూఢిల్లీ : గాల్వన్ లోయలో 20 మంది సైనికులు వీర మరణం పొందిన ఘటనపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై మరోసారి విరుచుకుపడ్డారు. ఆ జవాన్లకు ఆయుధాలు లేకుండానే రంగంలోకి దింపారని, అందుకే వారు అమరులయ్యారని దీనికి బాధ్యులెవరంటూ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు.
‘‘నిరాయుధులుగా ఉన్న భారత జవాన్లను క్రూరంగా చంపి చైనా తీవ్రమైన నేరం చేసింది. చైనాకు ఎంత ధైర్యం? నిరాయుధులైన సైనికులను రంగంలోకి దింపారు. అందుకే వారు అమరులయ్యారు.వారిని అలా ఎందుకు పంపిచారో తెలుసుకోవాలనుకుంటున్నా. దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు?’’ అంటూ రాహుల్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.