మే 3 తారీఖునే మోదీ ఎందుకు ఎంచుకున్నారంటే....

ABN , First Publish Date - 2020-04-14T20:30:44+05:30 IST

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లాక్‌డౌన్‌ను మే 3 వరకూ పొడగిస్తూ మంగళవారం కీలక ప్రకటన చేశారు. అయితే ఇటు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో

మే 3 తారీఖునే మోదీ ఎందుకు ఎంచుకున్నారంటే....

న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లాక్‌డౌన్‌ను మే 3 వరకూ పొడగిస్తూ మంగళవారం కీలక ప్రకటన చేశారు. అయితే ఇటు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ప్రజలు కూడా ఏప్రిల్ 30 వరకే పొడగిస్తారని భావించారు. కానీ ప్రధాని ఇందుకు భిన్నంగా మే 3 తేదీ వరకూ లాక్‌డౌన్ పొడగిస్తున్నట్లు ప్రకటించారు. మే  మూడో తారీఖునే ఎందుకు ఎంచుకున్నారంటే.... మే 1 తారీఖు మేడే సందర్భంగా పబ్లిక్ హాలీడే... మే 2, 3 తారీఖులు వారాంతపు రోజులు. ఈ రెండు కారణాలను దృష్టిలో ఉంచుకొనే ప్రధాని మోదీ మే 3 వరకూ దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను పొడగించారని ఢిల్లీ ఉన్నతాధికారులు భావిస్తున్నారు.


కొవిడ్-19ను కట్టడి చేసేందుకు లాక్‌డౌన్ పొడిగించాలంటూ పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చేసిన డిమాండ్‌ను కేంద్రం పరిగణనలోకి తీసుకుంది. మే 3 వరకు లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ప్రకటించారు.  దీంతో మరో 19 రోజుల పాటు దేశం లాక్‌డౌన్‌లోనే కొనసాగనుంది. ప్రధాని మోదీ ఇవాళ జాతినుద్దేశించి ప్రసంగిస్తూ ఈ మేరకు ప్రకటించిన విషయం తెలిసిందే. 

Updated Date - 2020-04-14T20:30:44+05:30 IST