న్యాయాన్ని అందజేయడం అత్యవసర సేవగా పరిగణించాలి : కపిల్ సిబల్

ABN , First Publish Date - 2020-04-25T21:58:24+05:30 IST

న్యాయం అందజేతను అత్యవసర సేవగా ఎందుకు పరిగణించరాదని కాంగ్రెస్ సీనియర్

న్యాయాన్ని అందజేయడం అత్యవసర సేవగా పరిగణించాలి : కపిల్ సిబల్

న్యూఢిల్లీ : న్యాయం అందజేతను అత్యవసర సేవగా ఎందుకు పరిగణించరాదని కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ శనివారం ప్రశ్నించారు. ఈ విషయాన్ని పరిశీలించాలని న్యాయ వ్యవస్థను కోరారు. 


‘‘ఈ దేశంలో న్యాయ సేవలు అత్యవసరం కాదా? న్యాయం అందజేత (డెలివరీ ఆఫ్ జస్టిస్) అత్యవసరం కాదా? దీనిని ప్రభుత్వం నిర్ణయించజాలదు, ఎందుకంటే, న్యాయ వ్యవస్థ స్వతంత్రమైనది కాబట్టి. న్యాయం అందజేతను అత్యవసర సేవగా నిర్ణయించాలని న్యాయ వ్యవస్థను కోరుతున్నాను’’ అని కపిల్ సిబల్ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా జరిగిన విలేకర్ల సమావేశంలో చెప్పారు.


క్రూడాయిల్ ధరలు అతి తక్కువగా ఉండటాన్ని ప్రస్తావిస్తూ, ఈ ప్రయోజనాన్ని ప్రజలకు ఎందుకు అందజేయడం లేదని ప్రభత్వాన్ని నిలదీశారు. పెట్రోలు ధరలు 20 డాలర్లకు చేరుకున్నాయన్నారు. సంక్షోభ సమయంలో ప్రభుత్వం దీని ప్రయోజనాలను ప్రజలకు కల్పించడం లేదన్నారు. ఈ ప్రయోజనాలను కంపెనీలకే అందజేస్తోందన్నారు. ప్రజలకు ఈ లబ్ధిని ఎందుకు అందజేయడంలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. 


Updated Date - 2020-04-25T21:58:24+05:30 IST