భారత్‌లో సెప్టెంబర్ 5.. మరి ప్రపంచమంతా అక్టోబర్ 5 ఎందుకలా?

ABN , First Publish Date - 2020-09-05T16:35:04+05:30 IST

భారతదేశపు మొట్టమొదటి ఉపరాష్ట్రపతి, రెండో రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజున అంటే సెప్టెంబర్ 5న దేశమంతటా అందరూ ఉపధ్యాయుల దినోత్సవం జరుపుకుంటారు. మరి ప్రపంచమంతా అక్టోబర్ 5న అంతర్జాతీయ ఉపధ్యాయుల దినోత్సవం జరుపుకుంటుంది. ఈ వ్యత్యాసం ఎందుకో తెలుసా?...

భారత్‌లో సెప్టెంబర్ 5.. మరి ప్రపంచమంతా అక్టోబర్ 5 ఎందుకలా?

భారతదేశపు మొట్టమొదటి ఉపరాష్ట్రపతి, రెండో రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజున అంటే సెప్టెంబర్ 5న దేశమంతటా అందరూ ఉపాధ్యాయుల దినోత్సవం జరుపుకుంటారు. మరి ప్రపంచమంతా అక్టోబర్ 5న అంతర్జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం జరుపుకుంటుంది. ఈ వ్యత్యాసం ఎందుకో తెలుసా?...


డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజునే ఎందుకు?

డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ 1962లో భారతదేశ రెండో రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. దేశ రాష్ట్రపతిగా ఎన్నికైన సందర్భంలో అదే సంవత్సరం ఆయన మిత్రులు, విద్యార్థులు ఆయన పుట్టినరోజుని వేడుకలా జరుపుకున్నారు. ఈ విషయం తెలిసిన డాక్టర్  రాధాకృష్ణన్ 'నా పుట్టినరోజుని వేడుకలా చేయాల్సిన అవసరం లేదు, ఉపాధ్యాయులని, గురువులని గౌరవించండి. ఎందుకంటే మన సమజాన్ని సరైన దారిలో నడిపే మహత్కార్యాన్ని వారే చేస్తున్నారు. ఉపధ్యాయుల సేవలను సమాజం గుర్తించే విధంగా ఓ వేడుక ఉండాలి' అని అన్నారు. అప్పటినుంచి దేశంలో 58 సంవత్సరాలుగా సెప్టెంబర్ 5న ఉపాధ్యాయుల దినోత్సవం జరుపుకునే సంస్కృతి మొదలైంది.


ప్రపంచమంతా అక్టోబర్ 5న అంతర్జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం ఎందుకు జరుపుకుంటుంది?

1966లో అక్టోబర్ 5న మొట్టమొదటిసారి ఐక్యరాజ్యసమితిలో సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర గురించి ప్రస్తావన వచ్చింది. వారి అధికారాలు, బాధ్యతల గురించి సుదీర్ఘ చర్చ జరిగింది. మళ్లీ 1994లో యునెస్కోలో 21వ శతాబ్దం కోసం ఉపాధ్యాయుల లక్ష్యాలను నిర్దేశించేటప్పుడు వారిని గౌరవించే విధంగా ఒక వేడుక చేయాలని అంతా భావించారు. అప్పుడు వారికి 1966 ఐక్యరాజ్యసమితిలో చర్చ జరిగిన తేది గుర్తుకు వచ్చింది. అంతే అప్పటి నుంచి ప్రతి సంవత్సరం అక్టోబర్ 5న  ఒక్క భారత దేశం మినహా ప్రపంచమంతా అంతర్జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం జరుపుకుంటుంది. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్(అంతర్జాతీయ కార్మికల సంఘం), యూనిసెఫ్, యునెస్కో కలిసి అంతర్జాతీయ స్థాయిలో ఈ వేడుక నిర్వహిస్తాయి. ప్రతి సంవత్సరం ఈ వేడుకలో ఓ థీమ్ ఉంటుంది.

2020 సంవత్సరానికి అంతర్జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం థీమ్ పేరు

'టీచర్స్ : లీడర్స్ ఇన్ క్రైసిస్, రెమిన్సింగ్ ది ఫ్యూచర్ '

Updated Date - 2020-09-05T16:35:04+05:30 IST