డబ్ల్యూహెచ్ఓ చీఫ్ నోట ‘ఆరోగ్యసేతు’ ప్రస్తావన!

ABN , First Publish Date - 2020-10-13T20:48:01+05:30 IST

కరోనా మహమ్మారి వ్యాప్తిపై నిఘా పెట్టేందుకు భారత్ ప్రభుత్వం రూపొందించిన ఆరోగ్యసేతు యాప్‌ గురించి ప్రపంచం ఆరోగ్య సంస్థ ఛీప్ టెడ్రోస్ అథానామ్ ప్రస్తావించారు.

డబ్ల్యూహెచ్ఓ చీఫ్ నోట ‘ఆరోగ్యసేతు’ ప్రస్తావన!

జెనీవా: కరోనా మహమ్మారి వ్యాప్తిపై నిఘా పెట్టేందుకు భారత్ ప్రభుత్వం రూపొందించిన ఆరోగ్యసేతు యాప్‌ గురించి ప్రపంచం ఆరోగ్య సంస్థ ఛీప్ టెడ్రోస్ అథానామ్ ప్రస్తావించారు. ఇండియాకు చెందిన ఈ యాప్‌ను ఇప్పటివరకూ 15 కోట్ల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారని ఆయన పేర్కొన్నారు. కరోనా కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను(క్లస్టర్ ప్రాంతాలు) గుర్తించడంలో అధికారులకు ఈ యాప్ ఎంతో ఉపయోగపడిందని కూడా ఆయన తెలిపారు. 


కరోనా కట్టడి దిశగా పరీక్షల సంఖ్య పెంచేందుకు ఈ సమాచారం ఎంతో ఉపయోగపడిందని ఆయన పేర్కొన్నారు. ప్రజారోగ్యం కోసం ప్రభుత్వాలు అమలు చేస్తున్న వ్యూహాలను డిజిటిల్ టెక్నాలజీ మరింత ప్రభావశీలంగా మార్చిందని ఆయన చెప్పారు. కాగా.. కరోనాను నియంత్రించేందుకు హెర్డ్ ఇమ్యూనిటీ వ్యూహాన్ని ఎంచుకోవడంలో ఎన్నో నైతికపరమైన ప్రశ్నలు తలెత్తుతాయని ఆయన చెప్పారు. కాబట్టి.. ఈ విధానాన్ని ప్రత్యామ్నాయంగా ఎంచుకోజాలమని ఆయన స్పష్టం చేశారు. 

Updated Date - 2020-10-13T20:48:01+05:30 IST