మాస్కులు ధరించడంపై మార్గదర్శకాలు మార్చిన డబ్ల్యూహెచ్ఓ

ABN , First Publish Date - 2020-06-07T01:00:20+05:30 IST

కరోనా వైరస్ సంక్రమించకుండా మాస్కులు ధరించడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) గతంలోని

మాస్కులు ధరించడంపై మార్గదర్శకాలు మార్చిన డబ్ల్యూహెచ్ఓ

న్యూఢిల్లీ: కరోనా వైరస్ సంక్రమించకుండా మాస్కులు ధరించడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) గతంలోని తన మార్గదర్శకాలను అప్‌డేట్ చేసింది. సామాజిక దూరం సాధ్యం కాని ప్రదేశాల్లో మాత్రమే మాస్కులు ధరించాలని సూచించింది. ఈ మేరకు ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ మీడియా సమావేశంలో తెలిపారు. వైరస్ సామాజిక వ్యాప్తి ఉన్న ప్రాంతాలలో 60 ఏళ్లు అంతకుమించి వయసున్నవారు, అంతర్లీనంగా లక్షణాలు కలిగిన వారు భౌతిక దూరం సాధ్యం కాని పరిస్థితుల్లో మెడికల్ మాస్కులను ధరించాలని సూచించారు. అంతర్జాతీయ నిపుణులు, పౌర సమాజ బృందాలతో విస్తృత సంప్రదింపుల తర్వాతే ఈ మార్గదర్శకాలను విడుదల చేస్తున్నట్టు చెప్పారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిధులతో 16 దేశాలు, ఆరు ఖండాల్లోని 172 పరిశీలన అధ్యయాలను సమీక్షించిన నాలుగు రోజుల తర్వాత డబ్ల్యూహెచ్ఓ ఈ మార్గదర్శకాలను విడుదల చేసింది. ఎన్ 95 మాస్కులు, అటువంటి రెస్పిరేటర్లు, లేదంటే ఫేస్‌మాస్కుల వాడకం వల్ల వైరస్ సంక్రమణ ముప్పు తగ్గుతుందని ఈ అధ్యయనాల్లో గుర్తించారు.  


Updated Date - 2020-06-07T01:00:20+05:30 IST