ట్రంప్‌కు మళ్లీ కరోనా టెస్ట్..!

ABN , First Publish Date - 2020-05-09T01:01:44+05:30 IST

ప్రపంచానికే పెద్దన్న అమెరికా. అలాంటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు కరోనా భయం పట్టుకుందా..? ప్రపంచంలో...

ట్రంప్‌కు మళ్లీ కరోనా టెస్ట్..!

వాషింగ్టన్: ప్రపంచానికే పెద్దన్న అమెరికా. అలాంటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు కరోనా భయం పట్టుకుందా..? ప్రపంచంలో మరే దేశాధ్యక్షుడికి చేయనన్ని కరోనా పరీక్షలు ట్రంప్ చేయించుకుంటున్నాడా..? అంటే అవుననే  సమాధానమే వస్తోంది. ఇప్పటికే ప్రపంచంలో అత్యధిక కరోనా కేసులు అమెరికాలోనే నమోదయ్యాయి. కరోనా వల్ల అగ్రరాజ్యం తవ్ర ఆర్థిక నష్టంతో పాటు వేల మంది  ప్రాణాలను కోల్పోయింది. ఈ నేపథ్యంలో వైట్‌హౌస్ అధికారులు అధ్యక్షుడిని కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఇటీవలే రెండు, మూడు సార్లు ట్రంప్‌కు వైద్యాధికారులు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల్లో నెగెటివ్ వచ్చింది. కాాగా తాజాగా వైట్‌హౌస్‌లో పని చేసే మిలటరీ సిబ్బంది ఇటీవల కరోనా బారిన పడడంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే ట్రంప్‌కు, ఆయన వ్యక్తిగత సిబ్బందికి మళ్లీ కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరితో పాటు ఉపాధ్యక్షుడు  మైక్‌పెన్స్‌కు, మరికొంతమంది వైట్‌హౌస్ సిబ్బందికి కూడా కరోనా పరీక్షలు నిర్వహించారు. అయితే  అధ్యక్షుడు ట్రంప్, ఉపాధ్యక్షుడు మైక్‌పెన్స్‌కు నిర్వహించిన కరోనా పరీక్షల ఫలితం నెగిటివ్‌గా వచ్చిందని, వ్యక్తిగత సమాయకుల్లో మాత్రం ఒకరికి కరోనా పాజిటివ్ తేలిందని వైట్‌హౌస్ వెల్లడించింది.

Updated Date - 2020-05-09T01:01:44+05:30 IST