భారత్‌లో వాట్సప్ బిజినెస్ యాప్ యూజర్లు 1.5 కోట్లు
ABN , First Publish Date - 2020-07-10T07:36:49+05:30 IST
ప్రపంచవ్యాప్తంగా తన బిజినెస్ యాప్‌నకు 5 కోట్లకు పైగా యూజర్లు ఉన్నట్టు వాట్సప్ గురువారం వెల్లడించింది. ఇందులో 1.5 కోట్లకు పైగా వినియోగదారులు భారత్‌లో ఉన్నట్టు తెలిపింది...

- ప్రపంచవ్యాప్తంగా 5 కోట్లకు పైగానే..
న్యూఢిల్లీ, జూలై 9: ప్రపంచవ్యాప్తంగా తన బిజినెస్ యాప్‌నకు 5 కోట్లకు పైగా యూజర్లు ఉన్నట్టు వాట్సప్ గురువారం వెల్లడించింది. ఇందులో 1.5 కోట్లకు పైగా వినియోగదారులు భారత్‌లో ఉన్నట్టు తెలిపింది. ఫేస్‌బుక్‌కు చెందిన వాట్సప్ 2018 సంవత్సరంలో వాట్సప్ బిజినెస్ యాప్‌ను విడుదల చేసింది. వ్యాపార సంస్థలు, కస్టమర్ల మధ్య కమ్యూనికేషన్ కోసం ఇది ఉపయోగపడుతోంది. కంపెనీలకు ఉపయోగపడే విధంగా క్యూఆర్ కోడ్స్, క్యాటలాగ్ షేరింగ్‌కు సంబంధించిన కొత్త ఫీచర్లను కూడా వాట్సప్ అందుబాటులోకి తీసుకురాబోతోంది.
‘‘ప్రపంచవ్యాప్తంగా వ్యాపార సంస్థలు పునఃప్రారంభానికి సిద్ధమవుతున్నాయి. ఆన్లైన్ ద్వారా విస్తరించాలనుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో వ్యాపార సంస్థలు సులభమైన మార్గాల్లో కస్టమర్లకు అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉంది. ప్రశ్నలు అడగడానికి, సమాచారాన్ని పొందడానికి లేదా ఏదైనా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉండాలి. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా 5 కోట్లకు పైగా వాట్సప్ బిజినెస్ యాప్ యూజర్లకు సపోర్ట్ చేస్తున్నాం’’ అని వాట్సప్ తెలిపింది. భారత్‌లో ప్రతి నెలా 1.5 కోట్ల మంది వాట్సప్ బిజినెస్ యాప్ వినియోగిస్తున్నట్టు పేర్కొంది.