రాజకీయాలకు, రియాకు లింకేంటి?

ABN , First Publish Date - 2020-09-01T16:53:26+05:30 IST

రియా చక్రవర్తి రాజకీయాల్లో పావుగా మారిందా?

రాజకీయాలకు, రియాకు లింకేంటి?

ముంబై: రియా చక్రవర్తి రాజకీయాల్లో పావుగా మారిందా? ఆరోపణలు, డిమాండ్ల వెనుక రాజకీయాలు ఉన్నాయా? రాజకీయాలకు, రియాకు లింకేంటి? ఈ దుమారమంతా ఎందుకు? మరో రెండు నెలల్లో జరగనున్న బిహార్ ఎన్నికలకు ఈ అంశం ఓ మైలేజ్‌గా మారిందా?


బాలివుడ్ నటుడు సుశాంత్‌ సింగ్ రాజ్‌పుత్ ముంబైలో ఆత్మహత్య చేసుకున్నాడు. అతనికి, రాజకీయాలకు సంబంధంలేదు. కానీ ఆ కేసు ఇప్పుడు రాజకీయంగా దుమారం రేపుతోంది. ఓవైపు అతని ప్రియురాలు  రియా చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. మరోవైపు బిహార్ నుంచి విమర్శల వర్షం కురుస్తోంది. అసలే రోజుకో ట్టిస్ట్ బయటపడుతుండడం.. ఈ కేసు అనేక మలుపులు తిరుగుతున్న సమయంలో రాజకీయంగా దాడి జరగడం మరింత గందరగోళంగా మారుతోంది.


సుశాంత్ కేసు బిహార్, మహారాష్ట్ర మధ్య రాజకీయ యుద్ధంలా మారింది. ఏకంగా అధికార పార్టీలు, రాజకీయ నాయకులే ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. బిహార్ బీజేపీ కూడా తనదైన శైలిలో మహారాష్ట్ర పోలీసులు, రాజకీయ నాయకులపై విమర్శలు కురిపించారు. దీంతో ఇప్పుడు ఈ అంశం రాజకీయంగా రెండు రాష్ట్రాల మధ్య హాట్ టాపిక్‌గా మారింది.

Updated Date - 2020-09-01T16:53:26+05:30 IST