కంగనా గురించి మాట్లాడటం మానేశాం : సంజయ్ రౌత్

ABN , First Publish Date - 2020-09-13T23:32:53+05:30 IST

కంగనా రనౌత్ విషయంపై మాట్లాడటం తాము మానేశామని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ప్రకటించారు

కంగనా గురించి మాట్లాడటం మానేశాం : సంజయ్ రౌత్

న్యూఢిల్లీ : కంగనా రనౌత్ విషయంపై మాట్లాడటం తాము మానేశామని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ప్రకటించారు. అయితే ఆ విషయంలో జరిగిన ప్రతి చర్యనూ తాము జాగ్రత్తగా గమనిస్తున్నామని తెలిపారు. దీని వెను ఏ రాజకీయ పార్టీ ఉందో, ఏ వ్యక్తి ఉన్నారో అన్ని విషయాలూ తమకు తెలుసని రౌత్ తెలిపారు. 


నేవీ రిటైర్డ్ అధికారి మదన్ శర్మ వ్యవహారంపై స్పందిస్తూ... దాడి చేసిన శివసైనికులను పోలీసులు అరెస్ట్ చేశారని రౌత్ తెలిపారు. చట్టాన్ని గౌరవించే రాష్ట్రం మహారాష్ట్ర అని ఆయన స్పష్టం చేశారు. అమాయకులపై ఎలాంటి దాడులు జరగకూడదన్నదే తమ ప్రభుత్వ అభిమతమని ఆయన ప్రకటించారు. యూపీలో కూడా ఇలాగే ఆర్మీ అధికారులపై దాడులు జరిగాయని, అయినా రక్షణ శాఖ స్పందించలేదని మండిపడ్డారు.


మహారాష్ట్ర పెద్ద రాష్ట్రమని, ఎక్కడైనా ఇలాంటివి జరగొచ్చని ఆయన పేర్కొన్నారు. కంగనా రనౌత్ విషయంపై స్పందిస్తూ... కంసోమవారం నుంచి ప్రారంభం కాబోయే పార్లమెంట్ సమావేశాల్లో జీఎస్టీ, చైనాతో పాటు సమకాలీన అంశాలపై తాము ప్రభుత్వాన్ని వివరణ కోరతామని సంజయ్ రౌత్ ప్రకటించారు. 

Updated Date - 2020-09-13T23:32:53+05:30 IST