బెంగాల్లో భారీగా పోలీస్ ఉన్నతాధికారుల బదిలీ

ABN , First Publish Date - 2020-08-13T05:21:56+05:30 IST

తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఇవాళ అనూహ్య నిర్ణయం తీసుకుంది.

బెంగాల్లో భారీగా పోలీస్ ఉన్నతాధికారుల బదిలీ

కోల్‌కతా: మమతా బెనర్జీ నేతృత్వంలోని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఇవాళ అనూహ్య నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పలువురు ఐపీఎస్ అధికారులు సహా 20 మంది పోలీస్ ఉన్నతాధికారులను బదిలీ చేసింది. ప్రభుత్వం వెలువరించిన ఉత్తర్వుల ప్రకారం... కోల్‌కతా ఆర్మ్‌డ్ పోలీస్ 2వ బెటాలియన్ డీసీపీ ద్యుతిమాన్ భట్టాచార్యను హౌరా పోలీస్ కమిషనరేట్ డీసీపీ(హెడ్ క్వార్టర్స్)గా పంపించింది. ఈ స్థానంలో ప్రస్తుతం కొనసాగుతున్న ప్రియాబ్రతా రాయ్‌ని కోల్‌కతా ఆర్మ్‌డ్ పోలీస్ బాధ్యతలు అప్పగించింది. బుద్ధ నగర్ పోలీస్ కమిషనరేట్ కొత్త డీసీపీ (హెడ్ క్వార్టర్స్)గా సూర్యప్రతాప్ సింగ్‌ను నియమించింది. అలీపూర్దౌర్ ఏఎస్పీగా ఉన్న ఉమేశ్ ఘన్‌పథ్‌కు బుద్ధ నగర్ డీసీపీగా బాధ్యతలు అప్పగించింది. కాగా బదీలీ అయిన అధికారుల్లో డీసీపీ, ఏఎస్పీ, ఎస్‌డీపీవో ర్యాంకుల అధికారులే ఎక్కువగా ఉన్నారు.

Updated Date - 2020-08-13T05:21:56+05:30 IST