లాక్‌డౌన్‌పై మమత సర్కార్ మరో కీలక నిర్ణయం

ABN , First Publish Date - 2020-07-28T23:39:13+05:30 IST

రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించే చర్యల్లో భాగంగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

లాక్‌డౌన్‌పై మమత సర్కార్ మరో కీలక నిర్ణయం

కోల్‌కతా: రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించే చర్యల్లో భాగంగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం కొనసాగుతున్న వారానికి రెండురోజుల సంపూర్ణ లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. ‘‘రాష్ట్ర వ్యాప్తంగా వారంలో రెండ్రోజుల పాటు ఆగస్టు 31 వరకు సంపూర్ణ లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నాం..’’ అని సీఎం మమతా బెనర్జీ పేర్కొన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రయివేటు ఆఫీసులు, వాణిజ్య సముదాయాలు, ప్రజా రవాణా, ప్రయివేటు రవాణా వాహనాలు ఈ నెల 29 వరకు మూసే ఉంటాయి. అదే రోజుల మళ్లీ లాక్‌డౌన్‌ పొడిగింపుపై నిర్ణయం వెలువడనుంది. కాగా లాక్‌డౌన్ సందర్భంగా కేవలం అత్యవసర సేవల వాహనాలను మాత్రమే అనుమతించాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని కోర్టులు, వ్యవసాయ పనులు, తేయాకు పనులు, పెట్రోల్‌ బంకులు, ఆహార పదార్థాల రవాణా తదితర సేవలకు కూడా లాక్‌డౌన్ నుంచి మినహాయించారు. మరోవైపు కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఇప్పటికే దేశీయ విమాన సర్వీసులను నిలిపివేశారు. 

Updated Date - 2020-07-28T23:39:13+05:30 IST