దుర్గా మాత విగ్రహాల నిమజ్జనంలో అపశ్రుతి

ABN , First Publish Date - 2020-10-27T11:45:05+05:30 IST

దుర్గామాత విగ్రహాల నిమజ్జనం కార్యక్రమంలో అపశ్రుతి చోటుచేసుకున్న విషాద ఘటన ....

దుర్గా మాత విగ్రహాల నిమజ్జనంలో అపశ్రుతి

పడవ మునిగి నలుగురి మృతి

ముర్షిదాబాద్(పశ్చిమబెంగాల్): దుర్గామాత విగ్రహాల నిమజ్జనం కార్యక్రమంలో అపశ్రుతి చోటుచేసుకున్న విషాద ఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో వెలుగుచూసింది. ముర్షిదాబాద్ నగరంలో దుర్గామాత విగ్రహాలను నిమజ్జనం చేస్తుండగా చెరువులో ఓ పడవ నీటిలో మునిగిపోయింది. ఈ పడవలో ఉన్న నలుగురు  మరణించారు. మృతుల్లో సుఖేందు దే(21), పికాన్ పాల్(23), అరిందం బెనర్జీ(20), సోమనాథ్ బెనర్జీలున్నారు. దుర్గామాత విగ్రహాలను నిమజ్జనం చేస్తుండగా ఈ ఘటన జరిగింది. పడవలో ఐదుగురున్నారని, నలుగురి మృతదేహాలు వెలుగుచూశాయని అధికారులు చెప్పారు.పోలీసులు గజఈతగాళ్లతో మృతదేహాలను వెలికితీస్తున్నారు. కోలాహలంగా సాగుతున్న దుర్గామాత విగ్రహాల నిమజ్జన కార్యక్రమంలో పడవ బోల్తా ఘటనతో ముర్షిదాబాద్ లో విషాదం అలముకుంది. 

Updated Date - 2020-10-27T11:45:05+05:30 IST