ఇంకా ఆరు నెలలు తప్పదు : సీఎం కీలక ప్రకటన

ABN , First Publish Date - 2020-12-20T20:13:30+05:30 IST

మరో ఆర్నెళ్ల పాటు రాష్ట్రంలోని ప్రజలందరూ విధిగా మాస్కులను ధరించాలని ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే కోరారు.

ఇంకా ఆరు నెలలు తప్పదు : సీఎం కీలక ప్రకటన

ముంబై : మరో ఆరు నెలల పాటు రాష్ట్రంలోని ప్రజలందరూ విధిగా మాస్కులను ధరించాలని ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే కోరారు. కరోనా దృష్ట్యా రాత్రిపూట కర్ఫ్యూను విధించాలని నిపుణులు సూచించారని, అయితే అందుకు తమ ప్రభుత్వం ఏమాత్రం సుముఖంగా లేదని ఆయన తేల్చి చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితి కాస్త అదుపులోనే ఉందని, కానీ... పూర్తిగా అదుపులో లేదన్నారు. ‘‘నివారణ కంటే నిరోధనే ఉత్తమం. మరో ఆరు నెలల పాటు విధిగా మాస్కులు ధరించండం అలవాటు చేసుకుందాం. కోవిడ్ నియమాలను పాటిద్దాం.’’ అని సీఎం ఉద్ధవ్ సూచించారు. 

Updated Date - 2020-12-20T20:13:30+05:30 IST