వెంటిలేటర్లను తయారు చేస్తాం

ABN , First Publish Date - 2020-03-24T09:36:38+05:30 IST

కరోనా మహమ్మారిపై పోరుపై సహకరించేందుకు పారిశ్రామిక దిగ్గజాలు ముందుకొస్తున్నారు. కరోనా బాధితుల సంఖ్య పెరుగుతుండడంతో ఆస్పత్రుల్లో చోటు కూడా...

వెంటిలేటర్లను తయారు చేస్తాం

మా రిసార్టుల్లో ఆరోగ్య కేంద్రాలు: ఆనంద్‌ మహీంద్రా


న్యూఢిల్లీ, మార్చి 23: కరోనా మహమ్మారిపై పోరుపై సహకరించేందుకు పారిశ్రామిక దిగ్గజాలు ముందుకొస్తున్నారు. కరోనా బాధితుల సంఖ్య పెరుగుతుండడంతో ఆస్పత్రుల్లో చోటు కూడా సరిపోవడం లేదు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో యాపిల్‌ సీఈవో టిమ్‌ కుక్‌, టెస్లా మోటార్స్‌ సీఈవో ఎలాన్‌ ముస్క్‌, అలీబాబా వ్యవస్థాపకుడు జాక్‌ మా వివిధ రూపాల్లో విరాళాలు ప్రకటించారు. తాజాగా ఈ జాబితాలో మహీంద్రా అండ్‌ మహీంద్రా గ్రూపు చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా చేరారు.


కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు వెంటిలేటర్లను తయారు చేస్తామని, తమ రిసార్టులను తాతాల్కిక ఆరోగ్య కేంద్రాలుగా వాడుకునేందుకు ఇస్తామని వెల్లడించారు. అలాగే చిరు వ్యాపారులను ఆదుకునేందుకు కంపెనీ తరఫున నిధిని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ నిధికి తన పూర్తి వేతనాన్ని విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆయన సోమవారం ట్విటర్‌లో వెల్లడించారు. ఆనంద్‌ మహీంద్రా ప్రకటనలపై నెటిజన్లు, ఆయన ఫాలోవర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2020-03-24T09:36:38+05:30 IST