అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం: రజినీకాంత్ సలహాదారు

ABN , First Publish Date - 2020-12-05T20:51:46+05:30 IST

అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం: రజినీకాంత్ సలహాదారు

అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం: రజినీకాంత్ సలహాదారు

చెన్నై: వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీకి జరగబోయే ఎన్నికల్లో 234 స్థానాల్లో పోటీ చేస్తామని రజినీకాంత్ రాజకీయ సలహాదారు తమిళరువి మణియన్ అన్నారు. రాజకీయాల్లోకి రాబోతున్నట్లు ప్రకటించిన రజినీకాంత్.. చాలా కాలం తర్వాత ఈ మధ్యే పార్టీ గురించి స్పష్టమైన ప్రస్తావన చేశారు. అయితే ఈ ఎన్నికల్లో రజినీ పార్టీ ఎవరితో జట్టు కట్టనుందనే విషయం రాజకీయంగా తీవ్ర స్థాయిలో చర్చనీయాంశమైంది. దీనికి తాజాగా రజినీకాంత్ రాజకీయ సలహాదారు స్పష్టతనిచ్చారు.


‘‘వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మేము 234 స్థానాల్లో పోటీ చేయబోతున్నాం. మా రాజకీయాలు ఆధ్యాత్మికమైనవి. అయితే ఇందులో ధ్వేషానికి తావు లేవు. మేము ఎవరికీ తిట్టం, ఎవరినీ కొట్టం. ప్రస్తుతం ఇలాంటి రాజకీయాలను మేము అవలంబించబోతున్నాం’’ అని తమిళరువి మణియన్ అన్నారు.

Updated Date - 2020-12-05T20:51:46+05:30 IST