కరోనా నెగెటివ్ రాకుంటే రాష్ట్రంలోకి నో ఎంట్రీ: హోం మంత్రి

ABN , First Publish Date - 2020-05-18T22:20:25+05:30 IST

ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులను సొంత రాష్ట్రాలకు రప్పించుకునేందుకు కేంద్రం ఇటీవల అనుమతిచ్చిన...

కరోనా నెగెటివ్ రాకుంటే రాష్ట్రంలోకి నో ఎంట్రీ: హోం మంత్రి

చండీఘర్: ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులను సొంత రాష్ట్రాలకు రప్పించుకునేందుకు కేంద్రం ఇటీవల అనుమతిచ్చిన విషయం తెలిసిందే. దీనికోసం రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను కూడా నడుపుతోంది. ఈ నేపథ్యంలో అనేక రాష్ట్రాలు బస్సులను కూడా ఏర్పాటు చేసి కార్మికులను రాష్ట్రాలకు రప్పించుకుంటున్నారు. దానికోసం ఆన్‌లైన్‌లో ఈ-పాస్‌లను జారీ చేస్తున్నాయి. పాస్‌లు ఉన్న వారిని రాష్ట్రంలోకి అనుమతిస్తున్నాయి. అయితే హర్యానా ప్రభుత్వం మరో నిబంధనను తీసుకొచ్చింది. కరోనా నిర్ధారణ పరీక్షలో నెగెటివ్ వచ్చిన వారినే రాష్ట్రంలోనికి అనుమతించనున్నట్లు పేర్కొంది.


ఈ మేరకు హర్యానా హోం శాఖా మంత్రి అనిల్ విజ్ మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలోనికి ప్రవేశించాలనుకునే ప్రతి ఒక్కరూ ముందుగా కరోనా పరీక్ష చేయించుకోవాలని, అందులో నెగెటివ్ వచ్చిన వారినే అనుమతిస్తామని తెలిపారు. వారి వద్ద ఈ-పాస్‌లు ఉన్నప్పటికీ, తమకు కరోనా లేదనే సర్టిఫికేట్‌ను కూడా అందజేయాల్సి ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలోకి కొత్తగా వచ్చిన వారి ద్వారా కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.

Updated Date - 2020-05-18T22:20:25+05:30 IST