కరోనాకు మందు కనిపెట్టాం: బంగ్లాదేశ్ డాక్టర్లు

ABN , First Publish Date - 2020-05-18T20:36:06+05:30 IST

కరోనాను అంతమొందించేందుకు మందు కనిపెట్టామని అనేక దేశాలు ఇప్పటికే...

కరోనాకు మందు కనిపెట్టాం: బంగ్లాదేశ్ డాక్టర్లు

ఢాకా: కరోనాను అంతమొందించేందుకు మందు కనిపెట్టామని అనేక దేశాలు ఇప్పటికే ప్రకటించుకుంటున్నాయి. ఇప్పుడు ఆ జాబితాలోకి బంగ్లాదేశ్ కూడా చేరింది. ఆ దేశానికి చెందిన ఓ వైద్య బృందం దీనికి సంబంధించి ఇటీవల ఓ ప్రకటన విడుదల చేసింది. కరోనాను నాశనం చేసేందుకు తాము రెండు రకాల ఔషధాలను కలిపి బాధితులపై ప్రయోగించామని, అది మంచి ఫలితాలనిస్తోందని పేర్కొంది. ఐవర్‌మెక్టిన్, డాక్సీసైక్లిన్ అనే రెండు రకాల ఔషధాలను కలిపి వినియోగించడం ద్వారా కరోనా బాధితులు త్వరితగతిన కోలుకుంటున్నారని ప్రకటించింది. దీనిపై డాక్టర్ ఎండీ తారెక్ ఆలం మాట్లాడుతూ, ఈ ఔషధాన్ని వినియోగించడం ద్వారా బాధితులు కేవలం నాలుగు రోజుల్లోనే కోలుకుంటున్నారని, అంతేకాకుండా దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నట్లు తమ దృష్టికి రాలేదని వివరించారు.

Updated Date - 2020-05-18T20:36:06+05:30 IST